Suryaa.co.in

Andhra Pradesh

అందరం కలిసి ఈ సైకో పాలనని అంతం చేయాలి

సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ

సైకో పాలనను అంతం చేయాలని సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. సత్తెనపల్లి పట్టణం ఐఎంఏ హాలులో సోమవారం నిర్వహించిన భారతీయ జనతా పార్టీ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. అందరం కలిసికట్టుగా పనిచేసి ఈ సైకో పాలనని అంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఎన్డీఏ కూటమి వస్తే ముస్లింలకు, దళితులకు అన్యాయం జరుగుతుం దన్నారు. వైసీపీ అధికారంలోకి రావడానికి చేస్తున్న విషప్రచారాన్ని ప్రజలకు తెలియ జేయాలని సూచించారు. ఎన్డీఏ కూటమి వస్తే మనం చేయబోతున్న అభివృద్ధిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన ఏకైక ప్రభుత్వంగా వైసీపీ చరిత్రలో మిగిలిపోతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ స్టేట్‌ ఎగ్జిక్యూటివ్‌ రవిశంకర్‌, జిల్లా అధ్యక్షుడు ఆలోకం సుధాకర్‌, జిల్లా ఇన్‌చార్జ్‌ శ్రీనివాస రావు, నియోజకవర్గ కన్వీనర్‌ కట్టా శంకరరావు, నియోజకవర్గ కో కన్వీనర్‌ పెద్దన్న రావు నాయక్‌, పట్టణ అధ్యక్షుడు శంకరరావు, నియోజకవర్గ, పట్టణ తెలుగుదేశం నాయకులు , జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE