పెన్షన్ల సొమ్మును కాంట్రాక్టర్లకు దోచిపెట్టిన జగన్‌రెడ్డి
పెన్షన్ల సొమ్ముతో పాటు ప్రభుత్వ నిధులు రూ.13 వేల కోట్లు మార్చి 16 నుంచి 30 మధ్య 15 రోజుల్లోనే ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా సొంత కాంట్రాక్టర్లకు జగన్మోహన్‌రెడ్డి దోచి పెట్టాడని గురజాల టీడీపీ అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు సోమవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. సచివాలయ సిబ్బంది, గ్రామ కార్యదర్శులతో పెన్షన్లు పంపిణీ చేయించకపోవడానికి నిధుల కొరతే కారణమని, దానికి ఎన్నికల కమిషన్, టీడీపీపై నెపం నెట్టడం సరికాదని వ్యాఖ్యానించారు.
ఏప్రిల్ 1 నుంచే ఇంటి వద్దే పెన్షన్లు పంపిణీ చేయాలని జగన్‌రెడ్డి ఎందుకు ఆదేశాలు జారీ చేయలేదు? ఖజానాలో నిధులు లేకనే కదా? 1.35 లక్షల సచివాలయ సిబ్బంది ద్వారా యుద్ధప్రాతిపదికన ఇంటి వద్దే పెన్షన్లు పంపిణీ చేయవచ్చు…జగన్మోహన్‌రెడ్డి స్వార్థ రాజకీయం వల్లే పెన్షన్‌దారులు, వాలంటీర్లు నష్టపోతున్నారని వ్యాఖ్యానించారు. టీడీపీ అధికారంలోకి రాగానే ఇంటి వద్దకే నెలకు రూ.4,000 పింఛన్ అందిస్తుందన్నారు.
పెన్షన్లు సకాలంలో ఇళ్ల వద్దనే పంపిణీ చేయకపోతే సీఎస్ జవహర్ రెడ్డి, సెర్ప్ సీఈవో మురళీధర్‌రెడ్డి, సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఎన్నికల కమిషన్ తగు చర్యలు తీసుకోవాలని కోరారు. తన దుర్మార్గాన్ని కప్పి పుచ్చుకో వడానికి జగన్మోహన్‌రెడ్డి ఎన్నికల కమిషన్, నిమ్మగడ్డ రమేష్, టీడీపీపై దుష్ప్రచారం చేయిస్తున్నాడని దుయ్యబట్టారు. వైసీపీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా ప్రజాసేవ మాత్రమే చేసే వాలంటీర్లను రాబోయే తెలుగుదేశం ప్రభుత్వం కొనసాగిస్తుందన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, సెర్ఫ్ సీఈవో మురళీధర్‌రెడ్డి పెన్షన్ల పంపిణీని సచివాల య సిబ్బంది ద్వారా ఇంటి వద్దనే చేయించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.