ఐఏఎస్ అధికారులు ఒక్కరు పనికిరారా?

– కేంద్ర ప్రభుత్వం ధర్మారెడ్డి పదవీ కాలాన్ని పొడిగించకపోతే, దేవాదాయ శాఖలో ఆయనకు సెక్రటరీ స్థాయి హోదా
– కోనసీమ అల్లర్లలో పివి సునీల్ కుమార్ ప్రమేయం ఏమైనా ఉన్నదా
– అంతా రెడ్లనే నియమించి సామాజికన్యాయమంటే నమ్మేదెవరు?
– ఒక్క నెలలోనే రికార్డు స్థాయిలో అప్పులు
– బస్సు యాత్ర కాదది… తుస్సు యాత్ర
– నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు

ఆంధ్రప్రదేశ్ కేడర్ కు చెందిన ఐఏఎస్ అధికారులు ఒక్కరు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం లో విధులు నిర్వహించడానికి పనికిరారా? అంటూ నరసాపురం ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. కేంద్ర సర్వీసుల్లో ఉన్న ధర్మారెడ్డి ని ఏడేళ్లు, రాష్ట్ర ప్రభుత్వ వీధుల్లో వినియోగించుకున్న తర్వాత కూడా, ఆయన పదవీ కాలాన్ని పొడిగించాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కోరడం విస్మయాన్ని కలిగిస్తోందన్నారు.

ప్రత్యేక కేసు కింద మూడు నెలల పాటు ధర్మారెడ్డి కి పదవి పొడిగించాలని నోట్ ఫైల్ మూవ్ చేశారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఒకవేళ ధర్మారెడ్డి పదవీ కాలాన్ని పొడిగించ కపోతే, దేవాదాయ శాఖలో ఆయనకు సెక్రటరీ స్థాయి హోదా కల్పిస్తూ, ఆయన్ని విధుల్లోకి తీసుకోవాలని ప్రయత్నం జరుగుతోందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి ఏడేళ్ల తర్వాత కూడా ఒక అధికారిని పదవిలో పొడిగించాలను కోవడం, టీటీడీ చట్టాన్ని సవరించాలి అనుకోవడం దురదృష్టకరమని రఘురామ కృష్ణంరాజు అన్నారు. రాష్ట్రంలోని ఐఎఎస్ అధికారుల నిస్సహాయత చూస్తే జాలి కలుగుతోందని చెప్పారు.

ఒకవైపు సామాజిక న్యాయ బేరి అంటూనే ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు, డీజీపీగా, కౌంటర్ ఇంటెలిజెన్స్ చీఫ్ గా రెడ్డి కులస్థుల నియమించడం విడ్డూరంగా ఉందన్నారు. రెడ్లు అంటే తనకు అపారమైన గౌరవం ఉందని, తన స్నేహితులు సింహభాగం రెడ్లే నని చెప్పుకొచ్చారు. తమ పార్టీ తరఫున తొమ్మిది మంది రాజ్యసభ సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తుంటే, అందులో నలుగురు ఒక సామాజిక వర్గానికి చెందిన వారే నని గుర్తు చేశారు. ఒకవైపు సామాజికన్యాయ భేరి సదస్సులు నిర్వహిస్తూ తమ సామాజిక వర్గానికి న్యాయం చేసుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయన్నారు.

తమ పార్టీ అధ్యక్షుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఈ ప్రభుత్వం అమలు చేయలేదన్నది జగమెరిగిన సత్యమని రఘురామ కృష్ణంరాజు అన్నారు. ఎన్నికల ప్రచార సభలో ఇచ్చిన హామీలను 95 శాతం అమలు చేయకుండానే, అమలు చేసినట్లు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చెప్పుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. రచ్చబండ కార్యక్రమంలో భాగంగా, జగన్మోహన్ రెడ్డి మూడేళ్ల ప్రభుత్వ పాలన పై రఘురామకృష్ణంరాజు విశ్లేషణ చేస్తూ, తనదైన శైలిలో స్పందించారు. గత మూడేళ్ల క్రితం ఎన్నికల ప్రచార సభల్లో అమరావతి రైతులకు, ప్రభుత్వ ఉద్యోగులకు, డ్వాక్రా మహిళలకు ఇచ్చిన హామీల వీడియోలను ప్రదర్శించారు.. మూడేళ్ల పాలన లో రాజధానిని నిర్మించ లేదంటూ చంద్రబాబు పాలనపై జగన్మోహన్ రెడ్డి నిప్పులు చెరుగుతూ, తాము అధికారంలోకి రాగానే అద్భుతమైన రాజధాని నిర్మిస్తామని రాజధాని రైతులకు ఇచ్చిన హామీకి సంబంధించిన వీడియోను ప్రదర్శించి, రాజధాని రైతులకు ఇచ్చిన మాటను జగన్ మోహన్ రెడ్డి తూచ్… అన్నారని ఎద్దేవా చేశారు.మద్యనిషేధం హామీ తుంగలో తొక్కారని, సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి, చేయకుండా ఉద్యోగులకు పంగనామాలను పెట్టారని మండిపడ్డారు. విద్యా దీవెన , విద్యా వసతి పథకాల సొమ్మును నేరుగా కాలేజీ ఖాతాలో చేర్చకుండా, నేరుగా ఓట్ల కొనుగోలు లో భాగంగా తల్లుల ఖాతాలు వేయడం వల్ల ఇప్పుడు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. కాలేజీ క్యాంపస్ నియామకాలు పూర్తయ్యాయని, అయినా కాలేజీ ఫీజులు చెల్లించలేదన్న కారణంగా వారికి సర్టిఫికెట్లు అందలేదన్నారు.

ప్రతి స్కీము లో 95 శాతం అమలు చేయలేదన్నది… పచ్చి నిజమని, ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదన్నారు. ఇక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం రోజు ఒక్క రూపాయి జీతమే తీసుకుంటామని చెప్పి, ప్యాలెస్ ప్రహరీ గోడ నిర్మాణానికి, హెలి ప్యాడ్ ఏర్పాట్లకు వందల కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులను ఖర్చు చేశారన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, డీజీపీ గౌతమ్ సవాంగ్, మంత్రి పేర్ని నాని లు తనకు మార్గదర్శకత్వం చేయాలన్న జగన్మోహన్ రెడ్డి, వారినే ముందు ఇంటికి సాగనంపార ని రఘు రామ ఎద్దేవా చేశారు. సాక్షి దినపత్రిక చుస్తే, మూడేళ్ల పాలనలో కడుపు నిండి పోతున్నట్లుగా కనిపిస్తుందని, కానీ ఏనాడు లేని విధంగా మహానాడుకు హాజరైన జనాన్ని చూసి ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. ఒంగోలు స్టేడియం లో 30 వేల మందితో సభ నిర్వహించాలనుకుంటే ప్రభుత్వ యంత్రాంగం అనుమతి నిరాకరించిన కారణంగా, పడుకున్న వారితో లేపి తన్నించుకున్న ట్లుగా ఇప్పుడు 60 ఎకరాలలో నిర్వహించిన సభకు .. మూడు లక్షల మందికి పైగా ప్రజలు హాజరయ్యారని, ఆ సంఖ్య 5 లక్షల వరకు కూడా ఉంటుందని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి సభలకు డ్వాక్రా మహిళలను మండే ఎండల తాకిడికి శారీరకంగా హింసించిన అప్పటికి పెద్దగా జనం హాజరు కావడం లేదని, హాజరైన వారు అర్థంతరంగా నే సభాస్థలి నుంచి నిష్క్రమిస్తున్నారని పేర్కొన్నారు.

మే నెలలో రాష్ట్ర ప్రభుత్వం రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి సినిమా రికార్డులను తలదన్నేలా పదివేల కోట్ల రూపాయల అప్పులు చేసిందని రఘురామకృష్ణంరాజు చెప్పారు. ఏప్రిల్ లో నాలుగు వేల కోట్లు, ఈ నెలలో 10 వేల కోట్ల రూపాయల అప్పులు చేసిందన్న ఆయన, ఉమ్మడి రాష్ట్రం లోనూ, మన రాష్ట్రం కంటే విస్తీర్ణంలో నాలుగు రెట్లు పెద్దది అయిన ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ స్థాయిలో అప్పు చేయలేదని చెప్పుకొచ్చారు.

ఎన్టీఆర్ అభిమానులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రుణ రత్న, అక్కినేని నాగేశ్వరరావు అభిమానులు రుణ సామ్రాట్, సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు రుణ శేఖర బిరుదులను ఇచ్చుకుంటారెమో చూడాలంటూ అపహాస్యం చేశారు. నటనలో జగన్మోహన్ రెడ్డికి ఆస్కార్ అవార్డు ఇవ్వవచ్చునని, కానీ ఆయన నటిస్తున్నట్లుగా జీవించాలని రఘురామకృష్ణంరాజు కోరారు.

ఆంధ్రప్రదేశ్ తో పోలిస్తే, తెలంగాణ ప్రభుత్వ అప్పులను కట్టడి చేయడంలో కేంద్ర ప్రభుత్వం కాసింత కఠినంగా వ్యవహరిస్తోందన్న ఆయన, ఏపీ ప్రభుత్వానికి ఆర్బీఐ నుంచి 28 వేల కోట్ల రుణ పరిమితిని కేంద్రం మంజూరు చేసిందన్నారు. మే మాసంలోనే పదివేల కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మరో రెండు నెలల వ్యవధిలోనే మిగిలిన 18 వేల కోట్ల రుణాన్ని ఊడ్చేస్తారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐ నుంచి ఈ అప్పులను చేయడానికి ఒక విధంగా తానే కారణమంటున్నారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎస్ బి ఐ లకు తాను రాష్ట్ర ప్రభుత్వానికి రుణాలను మంజూరు చేయవద్దని రాసిన లేఖల కారణంగానే, గత రెండు నెలలు గా బ్యాంకుల నుంచి దమ్మిడి కూడా అప్పు పుట్టడం లేదన్నారు. అందుకే జగన్ సర్కార్ బాహుబలి చిత్ర రికార్డులను తలదన్నేలా అప్పులను చేస్తోందని అపహాస్యం చేశారు.

మంత్రివర్గ సభ్యులు చేపట్టిన బస్సు యాత్ర తుస్సు యాత్ర గా మారిందని రఘురామకృష్ణంరాజు ఎద్దేవా చేశారు. తుస్సు యాత్రకు కు అనంతలో ముగింపు పలికారన్న ఆయన, తమ పార్టీకి బ్యాడ్ టైం స్టార్ట్ అయిందని చెప్పారు. తుస్సు యాత్రను మహానాడుకు ఒకరోజు ముందు స్టార్ట్ చేసి, మహానాడు ముగిసిన మరుసటి రోజు ముగించారని, ఈ సభలకు డ్వాక్రా మహిళలను, ఉపాధి కూలీ కార్మికులను తరలించిన ఎక్కడ సక్సెస్ కాలేదని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.

ఒక్క నరసరావుపేట లో నడిరోడ్డు మీద జంక్షన్లో సభ పెట్టిన మంత్రి రజినికి అభినందనలు తెలిపా రు. ఇక నంద్యాల కర్నూలు లో రికార్డింగ్ డాన్స్ లు, పెట్టినప్పటికీ ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయన్నారు. రెడ్ల ఆధిపత్యం కొనసాగే రాయలసీమ జిల్లాలలోనూ సామాజిక న్యాయ బేరి, బస్సే గింపు కార్యక్రమాలలో స్టేజిపై వక్తలు అధికంగా ఉంటే… స్టేజి ముందు సభికులు పలుచ బడ్డారని రఘు రామ అన్నారు.. బస్సు తరువాత ఎవరు ఏమి చెప్పినా నమ్మే పరిస్థితి లేదని, రాయలసీమ జిల్లాలలో సభలు చూశాక తమ పార్టీ భవిష్యత్తు తలచుకుంటే భయమేస్తుందని చెప్పారు. సచివాలయ వాలంటీర్లను లక్ష మంది నియమిస్తే, అందులో 60 వేల మంది ఉద్యోగాలు హాంఫట్ అంటున్నారన్న ఆయన, మాయమాటలు చెప్పడం తప్ప, చెప్పింది ది ఏ ఒక్కటి చేయడం లేదని విరుచుకుపడ్డారు.

కోనసీమ అల్లర్లలో పివి సునీల్ కుమార్ ప్రమేయం .. ఆ దిశగా ఆలోచించండి..
కోనసీమ జిల్లాకు, అంబేద్కర్ పేరు పెట్టడానికి స్వాగతిస్తూ ప్రభుత్వ అధికారి అభినందనలు తెలియజేయడం ఏమిటని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. అంబేద్కర్ మిషన్ ఇండియా సంస్థాపకుడైన పివి సునీల్ కుమార్, ముఖ్యమంత్రి నిర్ణయానికి అభినందనలు తెలియజేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ, కోనసీమ అల్లర్లలో ఆయన ప్రమేయం ఏమైనా ఉన్నదా అన్న విషయంపై దృష్టి సారించాలని డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డిని, డిజి బాలరాజు ను కోరారు.

ప్రభుత్వ నిర్ణయంపై, ఒక ప్రభుత్వ అధికారి అతిగా స్పందించడం ఏమిటన్నది అంతు చిక్కడం లేదని పేర్కొన్నారు. 1989 కు ముందుగతంలో తమిళనాడు లో కూడా కొందరు వ్యక్తుల పేర్ల పేరిట జిల్లాలను ఏర్పాటు చేయగా, తీవ్ర అల్లర్లు కులఘర్షణలు జరగడంతో వాటిని రద్దు చేశారని, ఈ విషయమై ముఖ్యమంత్రి స్టడీ చేయాలని రఘురామకృష్ణంరాజు సూచించారు.

Leave a Reply