డబ్బు లేకనే టీడీపీపై నెపం

గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌

సమర్థవంతమైన నాయకులు సాకులు వెతకరు, సంక్షేమం మాత్రమే చూస్తారు’ అని గుంటూరు పార్లమెంట్‌ టీడీపీ అభ్యర్థి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ వ్యాఖ్యానించారు. మంగళగిరి టీడీపీ జాతీయ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడు తూ వాలంటీర్లను ఎన్నికల్లో పాల్గొనవద్దని కేంద్ర ఎలక్షన్‌ కమిషన్‌ తీసుకున్న నిర్ణయాన్ని టీడీపీపై రుద్దడం జగన్‌ ప్రభుత్వం తన అసమర్థతను అంగీకరించినట్లేనన్నారు.

దేశంలో వాలంటీర్లు లేని రాష్ట్రంలోనూ పెన్షన్లు పంపిణీ జరుగుతున్నాయని, ఏపీలోనే ఎందుకు వైసీపీ రాద్ధాంతం చేస్తుందన్నదో ప్రజలే ఆలోచించాలని సూచించారు. ప్రభుత్వం వద్ద పెన్షన్‌ పంపిణీకి డబ్బులు లేవని చెప్పలేక టీడీపీపై బురదజల్లే ప్రయత్నం చేస్తుందన్నారు. ప్రభుత్వం చేతుల్లో రాష్ట్రవ్యాప్తంగా లక్షన్నర మంది సచివాలయ ఉద్యోగులు ఉన్నా వాలం టీర్లే పెన్షన్లు పంచాలని మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా పెన్షన్లు పంపిణీ చేయాలని కోరారు.

Leave a Reply