-జగన్ రెడ్డికి చిడతలు వాయించేందుకు రావడం తప్పా నీకేం చేతకాదు
-పోసాని మురళీ కృష్ణ లాంటి నీతిమాలిన వ్యక్తులు మొరుగుతూనే ఉంటారు
-ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందిన నాయకుడు జగన్ రెడ్డే
-పార్టీ పెట్టేందుకు తండ్రి శవం, అధికారంలోకి వచ్చేందుకు బాబాయ్ శవం, నేడు మళ్లీ అధికారం కోసం అవ్వాతాతల శవాలు అడ్డుపెట్టుకుంటున్న జగన్
– టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మద్దిపట్ల సూర్యప్రకాష్
జగన్ రెడ్డి లాంటి నీచ నాయకుడు అధికారంలో ఉంటే పోసాని మురళీ కృష్ణ లాంటి నీతిమాలిన వ్యక్తులు మొరుగుతూనే ఉంటారు. వాలంటీర్లకు టీడీపీ ఎప్పుడూ వ్యతిరేకం కాదు. చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడిన వారిని అడ్డుకున్నాం. జగన్ రెడ్డి రాజకీయ లబ్ధి కోసం అవ్వాతాతల శవాలతో ఓట్లు రాబట్టుకునే నీచపు చర్యలకు ఒడిగట్టారు.
వైఎస్ శవంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టింది, బాబాయ్ శవంతోనే జగన్ సీఎం అయ్యారు, ఇప్పుడు అవ్వాతాతల శవాలతోనే మళ్లీ అధికారంలోకి రావాలని కుట్రలు పన్నుతున్నారు. ఫించన్ల సొమ్ముతో పాటు ప్రభుత్వ నిధులు రూ.13వేల కోట్లు మార్చి 16 – 30 మద్య 15 రోజుల్లోనే ఎన్నికల కోడ్ కు విరుద్ధంగా సొంత కాంట్రాక్టర్లకు దోచిపెట్టిన జగన్‌రెడ్డి. సచివాలయ సిబ్బంది, గ్రామ కార్యదర్శులతో ఇంటి వద్దే ఫించన్లు పంపిణీ చేయించకపోవడానికి నిధులు కొరతే కారణం గాని ఎన్నికల కమీషన్, తెలుగుదేశం కాదు. నాడు వివేకానందరెడ్డిని గొడ్డలితో చంపించి దానిని చంద్రబాబుకి అంటగట్టి జగన్ రెడ్డి దుష్ర్పచారం చేయించాడు. నేడు కావాలనే పింఛన్ల పంపిణీ ఆలస్యం చేయిస్తూ దానిని టీడీపీకి అంటగట్టి దుష్ర్పచారాం చేయిస్తున్నారు. ఈ కుట్రను ప్రజలు తిప్పికొట్టాలి.
ఏప్రిల్ 1వ తారీఖు నుంచే ఇంటి వద్దే ఫించన్లు పంపిణీ చేయాలని జగన్ రెడ్డి ఎందుకు ఆదేశాలు జారీ చేయలేదు? ఖజానాలో నిధులు లేకనే కదా? 1.35 లక్షల సచివాలయ సిబ్బంది ద్వారా యుద్దప్రాతిపదికన ఫించన్లు ఇంటి వద్దే పంపిణీ చేయించలేదు. చంద్రబాబు సీఎం కాగానే ఇంటి వద్దకే నెలకు రూ. 4,000 పింఛన్ అందిస్తారు. గతంలో రూ.200 ఉన్న పింఛన్ రూ.2000 చేసింది కూడా ఆయనే.
ఈ మోసాన్ని కప్పిపెట్టుకోవడానికి జగన్‌రెడ్డి ఎన్నికల కమిషన్‌పైనా, నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌పైన, టీడీపీపైన దుష్ఫ్రచారం చేయిస్తున్నాడు. కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతూ రాజకీయ లబ్ధి పొందిన వ్యక్తి జగన్ రెడ్డి. రాష్ట్రాన్ని 5 ఏళ్ల పాలనలో 30 ఏళ్ల వెనక్కి నెట్టిన పులకేసి జగన్ కు పోసుకోలు పోసాని వత్తాసు రావడం సబబే. పాలన చేతగాని జగన్ లాంటి సీఎంలకు పోసాని లాంటి భజనగాళ్లు తప్పని సరిగా ఉండాల్సిందే. స్టేట్ ఫిల్మ్ అండ్ ధియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన తరువాత కనీసం ఒక్కసారైనా పట్టించుకున్నావా? జగన్ రెడ్డికి చిడతలు వాయించేందుకు రావడం తప్పా నీకేం చేతకాదని అర్ధమైపోయింది.