మైనారిటీల సంక్షేమం, అభివృద్ధి ఏన్డీయేతోనే సాధ్యం
వానర సైన్యంతో జగనాసురిడికి తప్పదు ఓటమి
ఏబిసిడీలు తెలియని వ్యక్తి జలవనరుల మంత్రా?
ఇసుక దోచేసి లక్షల మంది కార్మికుల పొట్టగొట్టారు
అధికారంలోకి వచ్చాక ఉచిత ఇసుకతో నిర్మాణ రంగాన్ని నిలబెడతాం
తల్లి కాంగ్రెస్… పిల్ల కాంగ్రెస్ పోటీలతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు
తండ్రి హత్యపై పోరాడుతున్న సునీత కూడా షర్మిలకు మద్దతుఫై ఆలోచించుకోవాలి
– పెదకూరపాడు ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
క్రోసూరు : ప్రజలకు భరోసా ఇవ్వాలని, భద్రత కావాలి, జీవితాలకు గ్యారెంటీ కావాలని కోరుకుంటున్నారు. ప్రజాగళం ద్వారా మీకు అండగా ఉంటానని చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. నేను ఒంటరిగా రాలేదు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు, ఈ రాష్ట్రానికి పట్టిన చీడ విరిగి పోవాలంటే అందరం కలిసి పని చేయాలని పవన్ కళ్యాణ్ అంటున్నారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం పదేళ్ల నుంచి ఉంది. మళ్లీ రాబోయే ఎన్డీఏనే. అందుకనే బీజేపీ, టీడీపీ, జనసేన జట్టుకట్టాం. మేము కలిసింది మీ భవిష్యత్ కోసమే. వైసీపీలో మైనారిటీకి అన్యాయం జరిగింది. ఎన్డీఏ ఉన్నా ఏ ఒక్క ముస్లిం, మైనారిటీకి అన్యాయం జరగనివ్వను.
రావణాసురుడిని చంపడానికి దేవుడైన రాముడికి వానర సైన్యం ముందుకు వచ్చారు. ఆఖరికి ఉడత కూడా సాయం అందించింది. అందుకనే టీడీపీ, బీజేపీ, జనసేనలు కలిసి వచ్చాయి. జగన్ శవాలతో వస్తుంటే టీడీపీ నాయకులతో వస్తున్నాం. ఐదేళ్ల పాలన ఒక పీడకలగా సాగింది. జగన్ స్వార్ధం కోసం నిండు ప్రాణాలు బలివ్వడానికి సిద్ధంగా ఉంటారు.
ఇసుక దోపిడీతో 40 లక్షల భవన నిర్మాణ కార్మికుల పొట్టకొట్టిన జగన్
పెదకూరపాడు నియోజకవర్గం అంటే పవిత్రమైన అమరావతి, అమరలింగేశ్వరుడు గుర్తుకువస్తారు. కాని ఇప్పుడు అమరావతి అంటే ఇసుక బకాసుడు శంకర రావు గుర్తుకు వస్తున్నాడు. హోల్ సేల్ గా దోపిడీ చేసే దోపిడీ దొంగలు. 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల పొట్ట కొట్టి జగన్, శంకర్ రావులు పొట్ట నింపుకుంటున్నారు. కృష్ణానది మీదే రోడ్డు వేసి ఇసుక దోచుకుంటున్నారు.
అక్రమ ఇసుకకు అడ్డు కట్టవేసి ఉచిత ఇసుకను అందిస్తాం. ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపి అణగదొక్కుతాను. ఒకప్పుడు ఒక ట్రాక్టర్ ఇసుక రూ.1000, నేడు రూ.5,000 పెరిగింది. అంటే ఒక్కో ట్రాక్టర్ కు రూ.4,000 జగన్ రెడ్డికి దోచిపెడుతున్నారు. ఈ అరాచకం చూస్తే కడుపు రగిలిపోతుంది. వైసీపీ ఫ్యాన్ ను ముక్కలు ముక్కలుగా చిత్తు చేస్తే సమాధి కట్టేందుకు తాపీ మేస్త్రీలు సిద్ధం కావాలి.
ముస్లిం ఆడబిడ్డలకు రక్షణ కల్పించి, ఆదుకుంటాం
ఐదేళ్లల్లో అనేక అరాచకాలు జరిగాయి. నందికొట్కూరులో ముస్లిం మహిళ నమాజ్ చేసుకొని వస్తుంటే వైసీపీ దొంగ ఆమెను బలవంతంగా బుర్కా తీసి దొంగ అనే విధంగా మాట్లాడారు. ఆ మహిళ భర్తకు చెప్పడంతో కుమారుడితో కలిసి వెళ్లి ఎందుకు చేశారని ప్రశ్నిస్తే చెప్పుతో కొట్టారు. ఒక ముస్లిం ఆడబిడ్డకి ఇలా జరిగిందంటే బాధ వేస్తుంది. శాప్ ఛైర్మన్ సిద్ధార్ధ రెడ్డి అనుచరుడు శ్రీనివాస్ రెడ్డి వీళ్లకు జగన్ రెడ్డి అండ పుష్కలంగా ఉంది. ముస్లింలకు అన్యాయం జరిగితే కనీసం కేసు పెట్టరా?
టీడీపీ హయాంలో ఎప్పుడైనా ఇలాంటి సంఘటనలు జరిగియా? పలమనేరులో 10వ తరగతి చదివే మిస్బా మొదటి ర్యాంక్ వస్తుందని సునీల్ అనే వైసీపీ నాయకుడి వేధింపులు బరించలేక ఆత్మహత్య చేసుకున్నారు, నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం వైసీపీ నేతల ఒత్తిడికి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. మాచర్లలో పిన్నెల్లి గ్రామంలో 100 కుటుంబాలు ఐదేళ్ల తరువాత ఇప్పుడు గ్రామానికి వచ్చారు. గురజాలలలో మైనారిటీ బాలికపై కాసు మహేష్ రెడ్డి అనుచరుడి అత్యాచారం చేస్తే ఇంత వరకు చర్యలు లేవు. ఇసుక మాఫియాపై పోరాడుతున్న కొమ్మాల పాటి శ్రీధర్ కి మైనారిటీ సోదరులు అడ్డుగా నిలిచారు.
ఎన్డీఏది విజన్, జగన్ రెడ్డిది పాయిజన్
తెలుగుదేశం ఎన్డీఏ భాగమైన 2014-19 కలిసే ఉన్నాం, 1995-2004 వరకు కలిసే ఉన్నాం. ఏనాడు ముస్లీంలకు అన్యాయం చేయలేదు. జగన్ 5 ఏళ్లు పూర్తిగా కేంద్రానికి సహకారమందించారు. నాది విజన్, జగన్ ది పాయిజన్. జగన్ అందరిని విషంతో చంపేసే రకం. హైదరాబాద్ ను సైబరాబాద్ ను నిర్మించాం. అదే స్పూర్తితో అమరావతి నిర్మించేందుకు సంకల్పిస్తే రైతులు భూములు స్వచ్ఛంధంగా ఇచ్చారు. అమరావతి నిర్మాణం పూర్తి అయ్యి ఉంటే ప్రజల జీవితాలు మారిపోయి ఉండేవి. కాని జగన్ రెడ్డి అన్నింటిని నాశనం చేశారు. అమరావతి పూర్తి అయ్యి ఉంటే ప్రభుత్వానికి లక్షల కోట్లు ఆదాయం వచ్చి ఉండేది. వాటిని ప్రజలకు మంచి పథకాలతో సంక్షేమాన్ని అందించవచ్చు.
మద్యం షాపులకే ఆన్ లైన్ పేమెంట్లు ఎందుకు పెట్టలేదు?
మీకు అమరావతి, రాజధాని కావాలా వద్దా? అమరావతి కావాలని ఇసుకాసుర శంకర్ రావు జగన్ ను ఏనాడైనా ప్రశ్నించారా? అదే లావు శ్రీకృష్ణదేవరాయలు అమరావతికి మద్ధతు పలికి వైసీపీ నుంచి భయటకు వచ్చారు. జాబు కావాలంటే బాబు రావాలి. గంజాయి రావాలంటే జగన్ రావాలి. 100 రోజుల్లో గంజాయి, డ్రగ్స్, జే బ్రాండ్లను పూర్తి నిర్మూలించే బాధ్యత మాది. ఒకప్పుడు క్వార్టర్ బాటిల్ రూ.60 నేడు రూ.200 పెరిగింది. దానిని తయారు చేసేది జగన్ రెడ్డే. డిస్ట్రిబ్యూషన్, అమ్మడం కూడా ఆయనే.
చాయ్ వాలా కూడా ఆన్ లైన్ పేమెంట్ చేస్తారు. కాని మద్యం షాపుల్లో ఎందుకు ఆన్ లైన్ లేదు. అంటే నేరుగా జగన్ జేబుకే పోతుంది. పిచ్చి మందుతో ప్రజల ఆరోగ్యాలను హరిస్తున్నారు. పెదకూరపాడులో గంజాయి ఉంది. ఈ ముఖ్యమంత్రి దుర్మార్గుడు. రాష్ట్రాన్ని కాపాడుకుందాం, మన పిల్లల భవిష్యత్ కాపాడుకుందాం. ప్రపంచంలో తెలుగు జాతి అగ్రస్థానంలో ఉన్నారు. పల్నాడు జిల్లాలో వేలాది మంది యువత విదేశాల్లో స్థిరపడటానికి కారణం టీడీపీనే. ఇప్పుడు జగన్ ఇంగ్లీష్ నేర్పిస్తున్నారని అంటున్నారు. ఇంగ్లీష్ రాకుండానే యువత విదేశాల్లో స్థిరపడ్డారా? నేడు ఐటీలో తరువాత లెవల్ కి వెళ్లిపోయారు.
ఏబిసిడీలు తెలియని వ్యక్తి జలవనరుల మంత్రా?
ఏ ఒక్క రైతు ఆనందంగా ఉన్నారా? నాశిరకం విత్తనాలు వచ్చాయి. పత్తి, పొగాకు రైతులు ఆనందంగా లేరు. ఈ ఏడాది మీకు నీళ్లు వచ్చాయా? నాడు పట్టిసీమను పూర్తి చేసి 130 టీఎంసీలు నీళ్లు తెచ్చి కృష్ణా బ్యారేజీతో డెల్టాను స్థిరీకరించి, అక్కడ నుంచిఆ నీళ్లు నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్ కు తెచ్చాం. వైకుంఠపురం బ్యారేజీ కట్టి ఎత్తిపోతలతో నకిరేకల్లుకు నీళ్లు తెచ్చి రైట్ మెయిన్ కెనాల్ ద్వారా నీళ్లు ఇవ్వాలని ప్రయత్నించాం. మళ్లీ అధికారలోకి వచ్చి ఉంటే ఈ పనుల్ని పూర్తి అయ్యి ఉండేవి.
పోలవరం 72 శాతం పూర్తి చేశాం. సమస్యల్నింటిని పరిష్కారం చేశాను. నదుల అనుసంధానంతో ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలనుకున్నాం. పోలవరంలో డయాఫ్రం వాల్, కాఫర్ డ్యాం, గైడ్ బండ్ లు నాశనం అయ్యాయి. ఆంబోతు రాంబాబుకు ఏ,బీ,సీ,డీ తెలియని వ్యక్తికి జలవనరుల శాఖకు మంత్రిగా చేశారు. అన్నదాత కింద ప్రతి రైతుకు రూ.20వేలు ఆర్ధిక సాయం, సబ్సిడీలు, సాగు నీటి ప్రాజెక్టులు పూర్తి చేసి రైతును రాజుగా చేసే బాధ్యత నాది.
జగన్ ఐదేళ్లల్లో ఒక్క మసీదుకైనా డబ్బులిచ్చారా?
కులం, మతం, ప్రాంతం లేదు. తెలుగు గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరికి న్యాయం చేసే బాధ్యత మాది. ముస్లిం సోదరులందరికి రంజాన్ మాసం శుభాకాంక్షలు. టీడీపీ ఉన్నప్పుడు రంజాన్ పండుగ జరుపుకోవాలని రంజాన్ తోఫాను అందించాం. ముస్లిం సోదరులకు న్యాయం చేసేందుకు ఇమామ్, మౌజన్ లను గౌరవ వేతనం ఇచ్చాం.
ముస్లింల సంక్షేమానికి పెద్ద పీట వేసిన పార్టీ టీడీపీ. ఉర్దూ యూనివర్సిటీ, హజ్ హౌస్, షాదీఖానాలు కట్టాం. జగన్ రెడ్డి మైనారిటీకి ఒక్క రూపాయి ఖర్చు పెట్టాడా? ముస్లింల పవిత్రమైన మాసంలో గుండె మీద చేయి వేసుకొని చెప్పాలి. ఒక్క మసీదుకైనా జగన్ డబ్బులిచ్చారు. తెలుగుదేశం పార్టీ బలపడాలి. బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలందరం కలిసి మీ రుణం తీర్చుకుంటాం.
మద్యాన్ని కంట్రోల్ చేస్తాం. రూ.10 ఇచ్చి జగన్ రెడ్డి రూ.100 దోచేస్తున్నారు. ప్రజలకు వేల కోట్ల ఆదాయం చూపించే బాధ్యత మేం తీసుకుంటాం. జగన్మోహన్ రెడ్డి శవరాజకీయాలను చేస్తున్నారు. 1.30 లక్షల మంది సచివాలయం ఉద్యోగులతో పెన్షన్ ఇంటి దగ్గరే ఇప్పించలేకపోయారు. అందుకే జగన్ రాజీనామా చేయమని డిమాండ్ చేశాం. అవ్వాతాతలకు పెన్షన్ ఇంటి వద్దే ఇచ్చే బాధ్యత మాది. రూ.200 పెన్షన్ రూ.2000 చేసింది టీడీపీనే. ఏప్రిల్ నుంచి రూ.4,000 పెన్షన్ ఇంటి వద్దే బాధ్యత ఎన్డీఏ. ఏప్రిల్, మే, జూన్ నెలలకు కలుపుకొని అదనంగా డబ్బులు ఇస్తాం.
పిల్ల కాంగ్రెస్ ఓటు చీలకుండా తల్లి కాంగ్రెస్ అడ్డుకునే ప్రయత్నం
ఎమ్మార్పీఎస్ కు న్యాయం చేసింది టీడీపీ. 1995లోనే క్యాటగిరైజేషన్ చేసింది కూడా టీడీపీనే. కోర్టు తీర్పు వస్తుంది. ఎవ్వరికి అన్యాయం జరగకుండా ఏ,బీ,సీ,డీ వర్గీకరణ చేసి మాదిగలకు న్యాయం చేస్తాం. ఆంధ్ర కొడుకుకు, తెలంగాణ కూతుకు రాసిచ్చానని ఆ తల్లి చెప్పింది. నేడు ఇద్దరికి బొట్టు పెట్టి పంపిచింది. వివేకానంద రెడ్డి హత్యపై నేను పోరాడాను. ఇప్పుడు పిల్ల కాంగ్రెస్ ను కాపాడేందుకు తల్లి కాంగ్రెస్ వస్తుంది. జగన్ రెడ్డి వ్యతిరేక ఓట్లు చీల్చాలి. ఇది కుట్ర, పన్నాగం. విభజన వలన నష్టపోయాం. హైదరాబాద్ తో సమానం ఏపీని తీర్చిదిద్దాలి. తెలంగాణ, ఏపీకి 35 శాతం తలసరి ఆదాయం తక్కువ ఉంది.
ఐదేళ్ల కష్టంతో 27 శాతానికి తగ్గించాను. జగన్ వచ్చాక ఐదేళ్ల వ్యత్యాసం 45 శాతం. మళ్లీ 100 శాతం. ఏపీలో ఉండే తెలుగు జాతి నష్టపోతున్నారా లేదా? ఇప్పుడు కాంగ్రెస్, జగన్ రెడ్డికి సాయం చేయాలని వచ్చారు. మీలో ఆలోచన విధానం మారాలి. ఆడపిల్లలకు అన్యాయం జరిగితే ఇంట్లో తేల్చుకోవాల్సిన వ్యవహారం. అంతేగాని ప్రజలకు అన్యాయం చేయకూడదు. దోషులెవరైనా శిక్షించాలని చెప్పాం. ఇప్పుడు సునీత ప్రజల్లోకి వచ్చి షర్మిలకు ఓటు వేయాలని చెబుతుంది. ఎన్డీఏకి పడే ఓట్లు డివైడ్ చేస్తే సైకోకు ఓట్లు పోతే రాష్ట్రం నష్టపోతుంది. జగన్ రెడ్డికి వ్యతిరేకంగా ఒక్క ఓటు చీలడానికి వీలు లేదు. ఎన్డీఏని గెలిపించుకోవాలి.
భవిష్యత్ లో వడ్డీ చెల్లించే బాధ్యత
ఇసుకాసురుడు శంకర్ రావు ఇసుక గుంతల్లో పడి 12 మంది చనిపోవడానికి కారకులయ్యారు. ఇంటి స్థలాల్లో 300 ఎకరాలు తక్కువ ధరకు కొని ఎక్కువ ధరకు అమ్ముకున్న ప్రభుద్ధుడు. ఆయన కొడుకు హడావుడి చేస్తున్నారు. గెలిస్తే టీడీపీలోకి వస్తానని చెబుతున్నారు. చేర్చుకుంటామా? జగన్ రెడ్డి మాయల పకీర్ అయితే చోటా మాయల పకీర్ లు పెరిగిపోయారు. రౌడీ ఇజానికి భయపడం, మా తమ్ముళ్ల జోలికి వస్తే ఖబర్దార్. భవిష్యత్ లో వడ్డీ చెల్లించే బాధ్యత నాది. మర్యాదకు మర్యాద ఇస్తాం. హద్దు దాటితో ఉగ్రరూరం చూపిస్తాం. నిన్నటి వరకు పోలీసులను అడ్డం పెట్టుకున్నారు. తీవ్రవాదులపైన పారాడం, మత విధ్యవేషాలు, ముఠాలను అణచివేసిన పార్టీ టీడీపీ.
పెదకూరపాడును అభివృద్ధి పథంలో తీర్చిదిద్దుతాం
పెదకూరపాడు, అచ్చంపేట, బెల్లంకొండలో జూనియర్ కాలేజీలు ఏర్పాటు. మద్దువరపు బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలి. అమరావతి నుండి బెల్లంకొండకు డబుల్ రోడ్డు, అమరేశ్వర ఆలయానికి రూ.26కోట్లు మంజూరు చేస్తే పెండింగ్ లో పెట్టారు, అంబరిపూడి లిఫ్ట్ ఇరిగేషన్ కు మరమ్మత్తులు పూర్తి చేస్తాం. ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాం. అన్ని వర్గాలకు రాజకీయ ప్రాధాన్యత ఇస్తాం.