Suryaa.co.in

Telangana

బషీర్‌ను తక్షణం విడుదల చేయాలి

-పేదల ఇళ్లు ధ్వంసం చేయడం అప్రజాస్వామికం
-సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం

ఖమ్మం: వరంగల్‌ నగరంలో పైడిపల్లి- కొత్తపేట శివారులో రెండున్నరేళ్లుగా ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకుని జీవిస్తున్న 1200 పేదలపై శుక్రవారం రాత్రంతా పోలీసులు విధ్వంసం సృష్టించారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం శనివారం ఒక ప్రకటనలో ఖండిరచారు. స్టాలిన్‌ నగర్‌గా పేరుపెట్టుకున్న ఆ ప్రాంతంలో పేదలకు పట్టాలు ఇస్తామని, ఇళ్లు కట్టుకోవడానికి రూ.5 లక్షలు సహాయం చేస్తామని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రకటించి ఇప్పుడు వాటిని ధ్వంసం చేయటం అప్రజా స్వామికమన్నారు. సీపీఎం నాయకుడు బషీర్‌ను కూడా అరెస్టు చేశారని, ఇంతకంటే అన్యాయం ఏముంటుందని ప్రశ్నించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పట్టాలు ఇచ్చి ఇళ్లు కట్టించాలని, అక్రమంగా అరెస్టు చేసిన బషీర్‌ను తక్షణం విడుదల చేయాలని కోరారు.

LEAVE A RESPONSE