Suryaa.co.in

Andhra Pradesh

సుజనా చౌదరికి నగరాల మద్దతు

పైలా సోమి నాయుడు

విజయవాడ పశ్చిమ నియోజక వర్గ కూటమి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుజనా చౌదరికి నగరాల కులస్తుల సంఘం మద్దతిస్తుందని దుర్గగుడి పాలకమండలి మాజీ చైర్మన్ సీనియర్ నాయకులు పైలా సోమి నాయుడు, నగరాల సంఘం నాయకులు ప్రకటించారు. శనివారం మిల్క్ ప్రాజెక్ట్ ఫంక్షన్ హాల్ లోని నందమూరి తారక రామారావు అభిమానుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు.

సీనియర్ బిజెపి నాయకులు పాలకమండలి మాజీ చైర్మన్ పైల సొమి నాయుడు మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గం లోని నగర కులస్తులు మరియు నందమూరి తారక రామారావు అభిమానులు సుజనా చౌదరి గెలుపు కోసం కృషి చేస్తారని తెలియజేశారు. సుజన చౌదరి నాయకత్వంలో పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని జనసేన టిడిపి బలపరిచిన సుజనచౌదరి ని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామన్నారు.

ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ కేంద్రంలో వెంకయ్య నాయుడు సుజనా చౌదరి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పెద్దన్న పాత్ర పోషించారని, ఎన్డీఏ పాలనలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం అలుపెరగని కృషి చేశారన్నారు. కేంద్ర మంత్రిగా పనిచేసిన వ్యక్తి పశ్చిమ నియోజక వర్గానికి ఎమ్మెల్యేగా రావడం మా అదృష్టంగా భావిస్తున్నామని అందరం సమిష్టిగా సుజనా గెలుపు కోసం కృషి చేస్తామన్నారు. టిడిపి సీనియర్ నాయకులు ఎంఎస్ బేగ్ మాట్లాడుతూ మైనారిటీల మద్దతు సుజనా చౌదరికి ఉంటుందన్నారు.

పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నా : సుజనా చౌదరి
సుజనా చౌదరి మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో అత్యధిక సంఖ్యలో ఉన్న నగరాలను పాలకపక్షం రాజకీయ ఓటు బ్యాంకుగా చూడటం సిగ్గుచేటన్నారు. నగర కులస్తుల అండతో గెలిచిన వెలంపల్లి శ్రీనివాస్ పశ్చిమ నియోజకవర్గాన్ని బ్రష్టు పట్టించారని బీసీలకు ముస్లిం మైనారిటీలకు మొండి చేయి చూపించారన్నారు. ఐదేళ్లుగా నియోజక వర్గంలో అభివృద్ధి ఏమాత్రం జరగలేదన్నారు. తనని ఎమ్మెల్యేగా గెలిపిస్తే దశాబ్దాలుగా ఉన్న కొండ ప్రాంత ప్రజల సమస్యలను పరిష్కరిస్తారని రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు నిర్మించి విద్యా వైద్యం అన్ని వర్గాల ప్రజలకు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు.

వెలంపల్లి శ్రీనివాస్ ను ఓడిస్తారని తెలిసి నియోజకవర్గం నుంచి ఆ పార్టీ నేతలే తరిమికొట్టారని అభ్యర్థిని మార్చినంత మాత్రాన చేసిన తప్పులు ఒప్పైపోతాయా అని ధ్వజమెత్తారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నగరాలకు ముస్లిం మైనారిటీలకు అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలబడతానని, పశ్చిమ నియోజక వర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని తెలిపారు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి నగరాలు పెద్ద ఎత్తున మద్దతు ఇవ్వాలని సుజనా కోరారు. కార్యక్రమంలో నగర సంగం నాయకులు రాయల హరిబాబు మాజీ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు (చంటి), బంక నాగమణి నగరాల సంఘం నాయకులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE