-వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొడతాం
-రాష్ట్ర ఎన్నికల సమన్వయకర్త పేరాల చంద్రశేఖర్
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశంలో రాష్ట్ర బీజేపీ ఎన్నికల సమన్వయ కర్త పేరాల చంద్రశేఖర్ మాట్లాడారు. బీజేపీ ప్రకటించిన మేనిఫెస్టో ఆంధ్రప్రదేశ్‌కు మేలు చేకూర్చనుందని వివరించారు. దేశంలో 80 కోట్ల ప్రజలకు ఉచితంగా బియ్యం, పేదలకు సొంతంటి కల బీజేపీతోనే సాధ్యమన్నారు. కుల వృత్తులు, రైతులకు ఇలా అన్ని వర్గాల వారికి మేలు జరుగుతుందని, డబుల్ ఇంజన్ సర్కారు వస్తే ప్రజలకు మేలు జరుగుతుందని తెలిపారు.
పెద్దఎత్తున దొంగ ఓట్లు సృష్టించింది
దొంగ ఓట్లు ఎన్నికలను ప్రభావితం చేసే అవకాశం ఉందని, ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయకుండా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని కోరారు. క్రిస్టియ న్, ముస్లిం అన్ని వర్గాల ప్రజలను బీజేపీ ఆదరిస్తుందని పేర్కొన్నారు. వైసీపీ బీజేపీపై విషప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుజరాత్‌లో వక్ఫ్ బోర్డు భూములకు ఎంత రక్షణ కల్పించామో చూపిస్తామంటూ వైసీపీపై ఆగ్ర హం వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రంలో క్రిస్టియన్లు, ముస్లింలు పేదరికంలో మగ్గిపోవడానికి కారణం వైసీపీ అన్నారు. అబద్ధపు ప్రచారాలు చేస్తూ లబ్ధి పొందాలని చూస్తోందని విమర్శించారు. ముస్లిం, క్రిస్టియన్ వర్గాలు సైతం బీజేపీ కూటమి అభ్యర్థులకు బాసటగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేటుకూరి సూర్య నారాయణ రాజు, మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ తదితరులు పాల్గొన్నారు.