Suryaa.co.in

Political News

అప్పుడు అన్నగారికి అభిమానులే ‘రక్ష’ణ

అన్న తారకరాముడు తెలుగుదేశం పార్టీ స్థాపించి, చైతన్యరథం ఎక్కినప్పుడు ఆయన వెంట తెలుగుప్రజలు లక్షలాదిగా నడిచారు. వందలు.. వేలు.. లక్షల సంఖ్యలో జనవాహిని. తెలుగుదేశం పిలుస్తోంది. రా. కదలిరా అన్న ఆయన పిలుపే ఒక ప్రభంజనం. అయినా ఇప్పటిలా అప్పట్లో వంద ల సంఖ్యలో పోలీసుల భద్రత లేదు. ఒక ఎస్‌ఐ, ఐదారుగురు కానిస్టేబుళ్లు చైతన్యరథం చుట్టూ ఉండేవారు. ఉన్నదల్లా అన్నగారి అభిమానులు, అభిమానసంఘ నేతలే. వారే అన్నగారికి ‘రక్ష’ణ. వందలాదిమంది అభిమానులు దగ్గరకొచ్చి అన్నను సం‘దర్శించు’కునే వారు.

అయినా అన్న గారి ఎన్నికల ప్రచారం ఎలాంటి అపశృతులు లేకుండా.. అంటే చిన్న రాయి కూడా పడకుండా సాఫీగా జరిగింది. కానీ ఇప్పుడు సీఎం జగన్ వస్తుంటే.. వేలమంది పోలీసులు, చుట్టూ పరదాలు, చెట్టు నరికేయడాలు, అడ్డంగా బారికేడ్లు! అయినా సరే తుంటరి గాళ్లు రాయి విసురుతున్న వైఫల్యం. నాటి ప్రచారంలో పోలీసులు చాలా తక్కువగా ఉండేవారు. ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది, అభిమాన సంఘాల వారు ఉండేవాళ్ళు ఆయన ఎలాంటి ఇబ్బంది లేకుండా 90 రోజుల్లో 30 వేల కిలోమీటర్లు ప్రయాణించారు. ఒక్కసారి మాత్రం హరికృష్ణ కి అంచనా లేక చైతన్య రథం రైల్వే క్రాసింగ్ దాటే సమయంలో గడ్డర్ తగిలి గాయమైంది. తెలుగునేల ఉన్నంతవరకు ఆయన శాశ్వతం ఆయన కీర్తి అజరామరం.

LEAVE A RESPONSE