Suryaa.co.in

Political News

ఏక్ దేశ్ మే దో నిషాన్.. దో ప్రధాన్ నహి చెలేగా..!

ఒకే దేశం.. ఒకే చట్టం.. ఒకే ప్రజా

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖండ భారత్ దీక్ష ఫలిస్తోంది. మనవి కాదు అనుకున్న కాశ్మీర్.. భరతమాత మణి కిరీటంలో చేరింది. దశాబ్దాల పోరాటంలో అనేక ఆటుపోట్లు చవి చూసినా అంతిమంగా భారతీయ జనతా పార్టీ అనుకున్నది సాధించింది. “ఒకే దేశం.. ఒకే చట్టం.. ఒకే ప్రజా.!” అనే నినాదంతో ఏర్పరచుకున్న లక్ష్యాన్ని చేదించడం అభినందనీయం. కాశ్మీర్ ప్రజలు నేడు స్వేచ్ఛగా జీవించడం,దేశానికి మరోసారి స్వతంత్రం వచ్చినంత ఆనందం కలుగుతోంది.

దేశంలోని పలు పార్టీలు దశాబ్దల కాలంగా రాజకీయ అవసరాల కోసం కాశ్మీర్ ని ఉపయోగించుకుని లబ్ధి పొందాయి. మైనారిటీ ఓట్ల కోసం కాశ్మీర్ ను పనంగా పెట్టాయి. దేశాన్ని అత్యధిక కాలం పాలించిన కాంగ్రెస్ పార్టీ ప్రధాన మంత్రులు కాశ్మీర్ సమస్యను మరింత జఠలం చేశారు తప్ప.. దాని పరిష్కారానికి ఎటువంటి చొరువ చూపకపోవడం వారి రాజకీయ అవసరాన్ని గుర్తుచేస్తుంది. ఏం జరుగుతోందని ని తెలుసుకునేందుకైనా జమ్మూ, కాశ్మీర్లలో పర్యటించకపోవడం దా రుణం. కాంగ్రెస్ ప్రధానులు ఒకవేళ వెళ్లినా.. విందులు ఆరగించి రావడం తప్ప అక్కడి పరిస్థితులు, భారత భూభాగం, కాశ్మీర్ సమస్య గురించి పెద్దగా చర్చించిన దాఖలాలు ఏవి కనిపించక పోవడం విశేషం.

భారత ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణం చేసిన నాటి నుంచి కాశ్మీర్ పైనే ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. అభివృద్ధి పనులు చేపట్టడం , మౌలిక సౌకర్యాల ఏర్పాటు, ఉపాధి కల్పనకు పెద్ద పీట వేసి కాశ్మీర్ ను భారత్ కు చేరువ చేశారు. భారత్ అంటేనే కాశ్మీర్ ప్రజల్లో విద్వేషాలు నింపిన అవకాశవాద, అరాచక శక్తుల ఆట కట్టించాడు. జవాన్లపై రాళ్లు రువ్వి భద్రతా దళాలను అవమానించే రీతిలో అసభ్యంగా వ్యవహరించిన వారి చేతే సలాం కొట్టించాడు. ఇది అక్కడి ప్రజల మానసిక మార్పున కు సంకేతంగా భావించవచ్చు.

ఈ క్రమంలో కాశ్మీర్ కు ఉన్న స్వయంప్రతిపత్తిని తొలగిస్తూ.. నియంతపు ఆలోచనలకు సమాధి కడుతూ.. ఒక్కో అధికారాన్ని ఊడ పీకేశాడు. విడతలుగా రాష్ట్రపతి పాలన విధించడం.. ఆ తర్వాత 35 ఏ, 370 ఆర్టికల్ రద్దు చేసి, జమ్మూ కాశ్మీర్ ను భారత్ లో పూర్తిగా కలిపేశాడు. అయితే ఈ చర్యను వ్యతిరేకిస్తూ కొంతమంది వేర్పాటు వాదులు, రాజకీయ నిరుద్యోగులు సుప్రీంకోర్టును ఆశ్రయించిన కూడా ఫలితం లేకపోయింది. 370 ఆర్టికల్ ఎత్తివేయడం సమర్థనీయమని, కాశ్మీర్ భారత్ దేనిని సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో 75 ఏళ్ల భారతమాత గాయం నయం అయినట్లయింది.

“ఎద్దు పుండు కాకికి ముద్దు” అన్నట్లు కాశ్మీర్ సమస్యను మరింత పొడిచి పొడిచి పెద్దది చేసి రాజకీయంగా వాడుకున్న వాళ్ళు తప్ప.. భారతీయులందరూ సుప్రీం కోర్టు తీర్పు చెప్పిన రోజు పండుగ చేసుకున్నారు. అయితే ఈ సమస్యపై పోరాటం ఈనాటిది కాదు. అనేక అవంతరాలు ఎదురైనా లక్షసాధనలో వెన్నుచూపని పోరాటం చేశాయి సంఘ్ పరివార సంస్థలు. భరతమాత మని కిరీటం చెదిరిపోనియ్యకుండా నిరంతరం ఉద్యమించారు. కాశ్మీర్ లోయలో ఊచ కోత , బలవంతపు మతమార్పిడిలు, లూటీలు, దోపిడీలు ,అత్యాచారాలు, హత్యలు అన్నింటిని ఎప్పటికప్పుడు ప్రపంచానికి తెలియజేస్తూ కాశ్మీర్ ప్రజల పక్షాన నిలబడింది సంఘ్ పరివార్.
ఇల్లు వాకిలి, ఆస్తిపాస్తులు, పొలం బలగం, సర్వం వదిలీ కట్టుబట్టలతో ప్రాణాలు వారి చేతిలో పెట్టుకొని వచ్చిన కాశ్మీర్ పండిట్లను, ఉగ్రవాద బాధితులకు అండగా నిలిచి భరోసా కల్పించింది రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్.

ఘోరమైన ఆకృత్యాలు, చెప్పనలవి కానీ నేరాలను తట్టుకునే నిలబడ్డ కాశ్మీరుల ఆకాంక్ష నెరవేర్చేందుకు ఎంతకైనా తెగించింది. నిన్న మొన్నటి వరకు పేరును గుర్తించి హిందువులుగా ఉన్న వాళ్లను హతమార్చిన ఘటనల వరకు అనేక ఘోరాలకు సమాధానం చెప్పింది నరేంద్ర మోడీ ప్రభుత్వం.

శ్యాం ప్రసాద్ ముఖర్జీ ఉద్యమించిన ఏక్ దేశ్ మే దో ప్రధాన్, దో నిషాన్, దో సంవిధాన్ (ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు, రెండు జాతీయ పతాకాలు,రెండు జాతీయ గీతాలు, రెండు సుప్రీంకోర్టులు , ఇద్దరు ప్రధానులు ఉండటం సరికాదు ) నహి చలేగా అంటూ నినదించిన శాంప్రసాద్ ముఖర్జీ ఆత్మ బలిదానం నుంచి, 1992 జనవరి 26న కాశ్మీర్ రాజధాని శ్రీనగర్ చౌరస్తాలో ఉగ్రవాదుల సవాల్ ను స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించిన నరేంద్ర మోడీ వరకు చేసిన పోరాటాలు చరిత్రాత్మకం.

తాను దగ్గరుండి ఉద్యమించిన కాశ్మీర్ సమస్య ను తానే ప్రధానంగా స్వయంగా పరిష్కరించడం నరేంద్ర మోడీ చేసుకున్న అదృష్టంగా భావించవచ్చు. ఆజాధి కా అమృత్ మహోత్సవాల వేడుకల సందర్భంగా భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతాలలో ఒకటైన కాశ్మీర్ సమస్య పరిష్కరించడం చాలా గొప్ప విషయం.

1980 దశకంలో మితిమీరిన ఉగ్రవాదుల ఆటవిక చర్యలపై, రాక్షసత్వం పై కూడా భారత ప్రభుత్వం స్పందించాలి. చెప్పనలివి కానీ రాక్షక్రీడతో మానహక్కుల హత్య జరిగింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇలాంటి సంఘటనలపై “కాశ్మీర్ ఫైల్స్” రూపంలో అతి కొంత భాగం ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నంలో ఒక సినిమాను కూడా విడుదల చేయడం మనం చూశాం.

ఉగ్రవాదుల అరాచకాలకు బలైన బాధితులకు బాసటగా నిలవడంతోపాటు, అరాచక శక్తులను కఠినంగా శిక్షించడం కూడా అత్యవసరం. ముఖ్యంగా ఆ రాష్ట్ర అందాలను తిలకించేందుకు ప్రతి భారత పౌరుడు కాశ్మీర్ వెళ్లాల్సిందే. ఇన్నాళ్లు రక్తం చిందిన మంచుకొండలు ఇక శాంతియుత వాతావరణంలో అభివృద్ధిని సాధించాలని కోరుకుందాం.

– పగుడాకుల బాలస్వామి
అధ్యక్షులు
జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (JAT)
9912975753
9182674010

LEAVE A RESPONSE