Suryaa.co.in

Andhra Pradesh

మంగళగిరి ప్రీమియర్ లీగ్-2 క్రికెట్ టోర్నమెంట్ పోస్టర్ ఆవిష్కరణ

-నారా లోకేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని క్రికెట్ టోర్నమెంట్
-గెలుపొందిన విజేతలకు రూ. 2 లక్షలు, రూ. లక్ష, రూ.50 వేలు బహుమతులు ప్రధానం
-మంగళగిరి పట్టణంలోని నారా లోకేష్ క్రీడా ప్రాంగణం(బోగి ఎస్టేట్స్)లో టోర్నమెంట్
-మంగళగిరి నియోజకవర్గానికి చెందిన వారు మాత్రమే పాల్గొనుటకు అర్హులు

మంగళగిరి టౌన్, డిసెంబరు 28: జనవరి 23న తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళగిరి పట్టణంలోని నారా లోకేష్ క్రీడా ప్రాంగణం(బోగి ఎస్టేట్స్)లో జనవరి 9వ తేదీ నుంచి 23వ తేదీ వరకు మంగళగిరి ప్రీమియర్ లీగ్-2 క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్దయ్య తెలిపారు.

ఈ టోర్నమెంట్‌ విశేషాలతో కూడిన వాల్‌పోస్టర్‌ను నియోజకవర్గ తెలుగుయువత ఆధ్వర్యంలో గురువారం టీడీపీ కార్యాలయం, ఎమ్మెస్సెస్ భవన్‌లో టీడీపీ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నందం అబద్దయ్య మాట్లాడుతూ ప్రతిభ గల క్రికెటర్లు వెలుగులోకి రావడానికి ఇలాంటి లీగ్‌లు ఉపకరిస్తాయని పేర్కొన్నారు. గత రెండు సంవత్సరాల నుంచి ప్రీమియర్ లీగ్ పోటీలను అద్భుతంగా నిర్వహించడం జరుగుతుందన్నారు.

ప్రథమ బహుమతి రూ. 2 లక్షలు, ద్వితీయ బహుమతి రూ. లక్ష, తృతీయ బహుమతి రూ. 50 వేలు అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. అలాగే మ్యాన్ ఆఫ్ ది సిరీస్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కు బహుమతులు అందించనున్నట్లు తెలిపారు. ఆసక్తిగల క్రీడాకారులు జనవరి 4వ తేదీ లోపు మంగళగిరిలోని టీడీపీ కార్యాలయం ఎమ్మెస్సెస్‌ భవన్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని వివరించారు. మరెన్ని వివరాలకు 98664 83147, 83676 08888 నెంబర్లకు కాల్ చేసి టోర్నమెంట్ కు సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చన్నారు. లీగ్‌లో మొత్తం 64 జట్టులు పాల్గొంటాయన్నారు.

మొదటగా వచ్చిన 64 టీమ్ లకు మాత్రమే అవకాశం ఉంటుందన్నారు. మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని యువకులు, క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని నందం అబద్ధయ్య తెలియజేశారు. ఎంట్రీ ఫీజు లేదన్నారు. మంగళగిరి నియోజకవర్గానికి చెందిన వారు మాత్రమే పాల్గొనుటకు అర్హులు. మొత్తం 15 మంది ఆధార్ కార్డు మరియు లేటెస్ట్ ఫోటోను మంగళగిరి నియోజకవర్గ టీడీపీ కార్యాలయములో అందజేయాలన్నారు. ప్రతి మ్యాచ్ కు గంటకు ముందు టోర్నమెంట్ ఆర్గనైజర్లకు మీ యొక్క టీమ్ మొత్తం రిపోర్ట్ చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో తమ్మిశెట్టి జానకీదేవి, దామర్ల రాజు, తోట పార్థసారథి, వల్లభనేని వెంకట్రావు, కేసంనేని శ్రీఅనిత, అమరా సుబ్బారావు, షేక్ రియాజ్, మల్లవరపు వెంకట్, తాళ్ళ అశోక్ యాదవ్, జవ్వాది కిరణ్ చంద్, అబ్దుల్ మజీద్, ఇట్టా పెంచలయ్య, గోర్ల వేణుగోపాల్ రెడ్డి(7రెడ్డి), కొప్పుల మధుబాబు, మన్నం అశోక్, షేక్ ఖాసీంబాబు, దాసరి సునీల్, తిరువీధుల సతీష్, దేవరపల్లి మహేష్, రెంటపల్లి రాజేష్, కంచర్ల దుర్గాప్రసాద్, గండికోట గంగాధర్, జలాది సందీప్, గుద్దంటి నాగేశ్వరరావు, ఉద్దంటి ధనూజ్, షేక్ అమీర్, కొమర బచ్చయ్య, తురకా దుర్గారావు, కుర్రా పుల్లారావు, షేక్ ఆరిఫ్, వంగర హనుమా, షేక్ జానీ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE