Suryaa.co.in

Andhra Pradesh

ఫెయిల్డ్ పార్టీ – దివాలా బాబు

రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేశ్‌

తెలుగుదేశం పార్టీది ప్రస్తుతం ఉనికి కోసం చేసే పోరాటమే. రేపటి ఎన్నికల్లో ఆ పార్టీ ఒంటరిగా పోటీచేసే సత్తా లేదన్న సంగతి అందరికీ తెలిసిపోయింది. ఇక, చంద్రబాబు రాజకీయాల్లో దివాలా తీసిన నాయకుడిగా మిగిలిపోయాడు. ఎవరికీ పట్టని దిక్కుమాలినోడిగా అతను తన పార్టీ పరువు నిలబెట్టుకునేందుకు ఎవరెవరి కాళ్లు పట్టుకుని పొత్తుల కోసం పాకులాడుతున్నాడో కూడా అందరూ చూస్తూనే ఉన్నారు.

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధినేత, మా నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి ని ఎదుర్కొనే దమ్మూధైర్యం, సత్తాలేకనే చంద్రబాబు పొత్తుల బేరాలకు వెళ్తున్నాడు. మరి, ఆ పార్టీ పరిస్థితి అలా ఉంటే.. ఈరోజు అచ్చెన్నాయుడును పార్టీ ఆఫీసులో పెద్ద ముత్తైదువలా కూర్చోబెట్టి, వైఎస్‌ఆర్‌సీపీ మేనిఫెస్టో హామీల అమలు గురించి మాట్లాడించడం చాలా సిగ్గుచేటు.

రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అన్నిపేద వర్గాల సోదరులు, అక్కచెల్లెమ్మలంతా వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం పట్ల చాలా సంతోషంగా ఉండటమనేది తెలుగుదేశం పార్టీకి జీర్ణించుకోలేని అంశమైంది. అందుకే, మా పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోను నెరవేర్చడంలో ఫెయిల్‌ అయిందంటూ అచ్చెన్నాయుడులాంటి పెద్ద ముత్తైదువ అంటుంది. నిజాలు గ్రహిస్తే.. ఆ పార్టీలో ఉన్న నాయకులంతా గుండెపగిలి చస్తారు.

చంద్రబాబు హయాంలో తన సొంత సామాజికవర్గం మినహా అన్ని సామాజికవర్గాల అభివృద్ధిని గాలికొదిలేసి.. ఎన్నికల మ్యానిఫెస్టో హామీల్ని చెత్తబుట్టదాఖలా చేసినందుకు 2019లో ప్రజలు తగిన బుద్ధిచెప్పారు. 2014 ఎన్నికల మ్యానిఫెస్టోలో సుమారు 650 హామీలిచ్చిన చంద్రబాబు వాటిల్లో ఏ ఒక్కటైనా నెరవేర్చారా..? పైగా, ప్రజలు ఎక్కడ ప్రశ్నిస్తారో అని, పార్టీ వెబ్‌సైట్‌ నుంచే తొలగించి మాయం చేసిన నీచుడుగా ముద్ర పడి ప్రజల దృష్టిలో ఫెయిల్డ్‌ పార్టీ- దివాలా నేతగా చంద్రబాబు పేరుతెచ్చుకున్నాడు.

LEAVE A RESPONSE