– వైసీపి ప్రభుత్వాన్ని దించడమే ఎన్డీఎ లక్ష్యం
– బీజేపీ మీడియా ఇన్చార్జి నాగభూషణం
-కేంద్రం నిధులు మింగేసిన అనకొండ జగన్
– మాజీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్
విజయవాడ : ఎన్డీఎ పక్షాలు మీడియా సమావేశం నిర్వహించాయి. బిజెపి మీడియా ఇంఛార్జి పాతూరి నాగభూషణం, తెలుగుదేశం నేత మాజీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్, జనసేన పిఎసి సభ్యుడు కోన తాతారావులు సంయక్తంగా పాత్రికేయుల సమావేశం నిర్వహించారు
వైసీపి ప్రభుత్వాన్ని దించితేనే గ్రామీణ పరిపాలన మెరుగు పడుతుందని అందువల్ల సర్పంచ్ లు, ఎంపిటిసీలు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఎ ని గెలిపించేందుకు సిద్దంకావాలని ఎన్డీఎ పక్షాలు పిలుపునిచ్చాయి. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఎన్డీఎ పక్షాలు మాట్లాడుతూ పంచాయితీ రాజ్ వ్యవస్ధను నిర్వీర్యం చేసిన వైసీపిని ఎన్నికల్లో సాగనంపడానికి గ్రామీణులు సిద్దంగా ఉన్నారన్నారు.
బిజెపి మీడియా ఇంఛార్జ్ పాతూరి నాగభూషణం మాట్లాడుతూ.. ఏ ప్రభుత్వం గతంలో గ్రామాలకు ఇచ్చిన సొమ్మును పక్కదారి పట్టించలేదు. గ్రామాలకు రావాల్సిన సొమ్ములు పక్కదారి పట్టించి.. ఎలక్షన్స్ ముందు 960 కోట్లు విడుదల చేశారు.. కేంద్రం ఇచ్చిన సొమ్ములు కూడా పక్కదారి పట్టిస్తున్నారు.గ్రామలకు అన్ని వసతులు కావాలంటే, మార్జిన్ మనీ కట్టి నిధులు తెచ్చుకోలేదు.స్ధానిక సంస్ధలను నిర్వీర్యం చేశారు.
ఏపీ పంచాయితీరాజ్ ఛాంబర్ చైర్మన్ వై.వి.బి.రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ
సర్పంచులు, ఎంపిటిసి లను ఉత్సవ విగ్రహాలుగా మార్చేసారు. సర్పంచులు, ఎంపీటీసీలు హీనమైన దీనమైన పరిస్ధితుల్లో ఉన్నారు.కేంద్రం ఇచ్చే నిధులను ఏపీ ప్రభుత్వం దారి మళ్ళించి సొంత పథకాలు వాడారు.
3.5 కోట్ల మందికి రావాల్సిన ఆర్ధిక సంఘం నిధులు 8600 కోట్లు దారి మళ్ళించారు.988 కోట్లు మరల కేంద్రం పంపితే అవి కూడా గ్రామ పంచాయతీలకి విడుదల చేయలేదు. పంచాయితీరాజ్ కు కేంద్రం ఇచ్చే నిధులకు ముఖ్యమంత్రి సైంధవుడిలా తయారయ్యాడని దుయ్యబట్టారు.
జలజీవన్ మిషన్, రూరల్ రోడ్ మెయింటెనెన్స్ నిధులు పక్కదారి పట్టించారు.అప్పులు చేసి రోడ్లు, డ్రైనేజీలు వేస్తే ఆ బిల్లులు కూడా రాలేదు.గ్రామీణ, పట్టణ ప్రజలకు త్రాగునీరు, రోడ్లు ఇవ్వడానికి తగిన నిధులు కేటాయిస్తూ మేనిఫెస్టో లో పెడతాం.సర్పంచులు, ఎంపీటీసీ లకు గౌరవ వేతనాలు పెంచుతాం.. వైసీపి ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు సర్పంచ్ లు అందరూ ఏకతాటిపైకి రావాలన్నారు.
జనసేన పిఏసీ సభ్యుడు కోన తాతారావు మాట్లాడుతూ.జీవన ప్రమాణాలు పెంచాలని నరేంద్ర మోదీ ప్రయత్నిస్తున్నారు. పల్లెలు ప్రగతి సాధించాలంటే ఎన్డీఎ అధికారంలోకి రావాలన్నారు
నీటి సరఫరాలో 5వ స్ధానం నుంచీ 26వ స్ధానానికి వచ్చాం..జలజీవన్ మిషన్ నిధులు ఇవ్వకపోవడం చూస్తే ఏపీ ప్రభుత్వానికి గ్రామీణ ప్రజలంటే చులకనా అనుకోవాల్సి వస్తోంది. 12918 గ్రామ పంచాయతిలలో 598 గ్రామ పంచాయతీ లకు మాత్రమే మరుగుదొడ్లు ఉన్నాయి . రాష్ట్రంలో రాజ్యాంగ సవరణల స్వరూపాన్నే మార్చేసారు.