Suryaa.co.in

Andhra Pradesh

లోకేష్ సమక్షంలో టిడిపిలోకి గుంటూరు నేతలు

-గళ్లా మాధవి ఆధ్వర్యాన పశ్చిమలో భారీగా చేరికలు!

అమరావతి: గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రముఖులు యువనేత నారా లోకేష్ సమక్షంలో టిడిపిలో చేరారు. ఉండవల్లి నివాసంలో పశ్చిమ నియోజకవర్గ టిడిపి అభ్యర్థి గళ్లా మాధవి, గుంటూరు పశ్చిమ పరిశీలకులు మల్లెల రాజేష్ నాయుడు, సీనియర్ నాయకులు ఉగ్గిరాల సీతారామయ్య ఆధ్వర్యాన 60మంది పార్టీలో చేరిన వారికి యువనేత పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… అయిదేళ్ల జగన్ పాలనలో ధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్దఎత్తున నాయకులు తరలివచ్చి టిడిపిలో చేరుతున్నారన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు నేతృత్వంలో పనిచేయడానికి కలిసి వచ్చే వారందరికీ పార్టీ ద్వారాలు తెరిచే ఉంటాయని చెప్పారు. పార్టీలోకి కొత్తగా వస్తున్న నేతలు రాబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి సమిష్టిగా కృషిచేయాలని, వారందరికీ అధికారంలోకి వచ్చాక తగిన గుర్తింపునిస్తామని తెలిపారు.

పార్టీలో చేరిన వారిలో తేలుకుట్ల హనుమాయమ్మ (19వ డివిజన్ కార్పొరేటర్), సాదు ఉమామహేశ్వరి (23వ డివిజన్ కార్పొరేటర్), వైసిపి జిల్లా మైనారిటీ నాయకులు ఎస్.కె మహబూబ్ బాషా (టెంట్ హౌస్ బాబు), ఎస్ కె బాషా (19వడివిజన్ వైసిపి అధ్యక్షుడు), సాదు రాజేష్, తేలుకుట్ల యోగేశ్వరరావు, సమీర్ బాషా, అరవింద్, ఫిరోజ్, శ్రీరాములు, మణికంఠారెడ్డి, సిరా నాగతేజ, అజీజ్, ఒంగోలు శ్రీను, మహమ్మద్ దాదా కరీమ్, వెంకటేశ్వర్లు, తుమ్మల నాగేశ్వరరావు, షేక్ సుభాని, సుబ్బారెడ్డి, షేక్ రసూల్, అడకా వెంకట్రావు తదితరులు ఉన్నారు.

LEAVE A RESPONSE