Suryaa.co.in

Andhra Pradesh

ఎయిమ్స్‌కు నీరివ్వలేని నేతలు మాపై విమర్శలా?

– పెన్షన్లు పంపిణీ చేయలేని యంత్రాంగం ఎందుకు?
-గత పొరపాట్లు పునరావృతం కాకుండా చూడాలి

-ఇంటి దగ్గరే పంపిణీ చేయాలి..లేకుంటే అకౌంట్లలో వేయాలి
-ఏదిపడితే అది మాట్లాడితే కుదరదు…బొత్సా…
-బీజేపీ రాష్ట్ర మీడియా ఇన్‌చార్జి పాతూరి నాగభూషణం

బీజేపీ రాష్ట్ర మీడియా ఇన్‌చార్జి పాతూరి నాగభూషణం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. పెన్షన్ల విషయంలో అధికారులు ముందు చూపుతో వ్యవహరించాలి. ఏప్రిల్‌లో పెన్షన్‌ విషయంలో అధికారుల అలసత్వం కనిపించింది. వైసీపీ నాయకులు మంచాలపై మోస్తూ రాజకీయ లబ్ధికి కుట్ర చేశారు. 30 మందికి పైగా చనిపో యారంటే అధికారులదే బాధ్యత. ఇంత జరిగినా చీఫ్‌ సెక్రటరీ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. మే మూడు వరకే పెన్షన్లు ఇస్తామని ఆయన అంటున్నారు. సచివాలయం సిబ్బందితో ఇళ్లకు వెళ్లి పెన్షన్‌ ఇవ్వాలి. పెన్షన్లకు డబ్బులు లేవంటారు.. మీ బంధువులకు బిల్లులు మంజూరు చేసుకుంటున్నారు. ఎవరెవరికి ఎంత బిల్లులు ఇచ్చారో మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. పెన్షన్‌ దారులను ఇబ్బంది పెట్టడమే చీఫ్‌ సెక్రటరీ ఉద్దేశమా? వాలంటీర్లు లేకుండా పెన్షన్‌ పంపిణీ చేయలేని యంత్రాంగం ఎందుకు? అని ప్రశ్నించారు.

వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలని సీఎంతో సహా అనేకమంది అంగీకరించారు. అధికార పార్టీకి అధికారులు కొమ్ము కాయడం మానుకోవాలని, ఒకటి నుంచి పింఛన్లు సచివాలయాల్లో ఇవ్వడం ఆపి ఇళ్లకే ఇవ్వాలని కోరారు. లక్షా 35 వేల మంది సిబ్బంది 64 లక్షల మందికి పింఛన్లు ఇవ్వలేమంటే అది మీ చేతకాని తనం కాదా? రేపు పెన్షన్ల కోసం వచ్చి ప్రాణాలు కోల్పోతే అది హత్యలుగా పరిగణి స్తాం. ముందురోజే డబ్బులు డ్రా చేసి ఇళ్లకు పంపాలి. బ్యాంకు అకౌంట్‌ ఉన్న వారికైనా వారి ఖాతాల్లో పెన్షన్‌ వేయాలని కోరారు. మిగిలిన వారికి ఇళ్లకే వెళ్లి ఇస్తే.. సిబ్బందికి శ్రమ కూడా తగ్గుతుందన్నారు. మంత్రి బొత్స పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని, కేంద్ర మంత్రి పీయూ ష్‌ గోయల్‌ను విమర్శించే అర్హత బొత్స సత్యనారాయణకు లేదన్నారు. రైల్వే జోన్‌ విషయంలో మాపై బురద జల్లుతున్నారని, ఎయిమ్స్‌కు వాటర్‌ ఇవ్వలేని వైసీపీ నేతలు మాపై విమర్శలు చేస్తారా అని మండిపడ్డారు. కేంద్ర ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం స్థలం కూడా ఇవ్వలేదు. బొత్స గారు ఒకసారి వెనక్కి చూసుకుని మాట్లాడితే మంచిది..ఏది పడితే అది అంటే ప్రజలు మిమ్మల్సి నమ్మరని హితవుపలికారు. సమావేశంలో బీజేపీ అధికార ప్రతినిధి ఆర్‌.డి.విల్సన్‌ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE