Suryaa.co.in

Andhra Pradesh

‘‘లెట్స్‌ ఓట్‌’’ 3కే రన్‌

-రాష్ట్రంలో 82 శాతం పైనే ఓటింగ్‌ లక్ష్యం
-రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్‌కుమార్‌ మీనా
-పోలింగ్‌ రోజే అసలైన పండగ
-యువత బాధ్యతతో ఓటేయాలి

మొదటిసారి ఓటు వేయనున్న ఓటర్లకు అవగాహన కల్పించేందుకు గుంటూరు ఎన్టీఆర్‌ స్టేడియం నుంచి కొరటిపాడు, వెల్కమ్‌ హోటల్‌ రోడ్డు మీదుగా తిరిగి ఎన్టీఆర్‌ స్టేడియం వరకు 3కే నడక కార్యక్రమం శనివారం జరిగింది. ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఎన్నికల ప్రధానా ధికారి ముకేష్‌కుమార్‌ మీనా పాల్గొన్నారు. ఆయనతో పాటు కలెక్టర్‌, ఎస్పీ, జాయింట్‌ కలెక్టర్‌, నగరపాలక సంస్థ కమిషనర్‌ కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ముకేష్‌కుమార్‌ మీనా మాట్లాడుతూ దేశ, రాష్ట్ర భవిష్యత్తు యువత చేతిలోనే ఉందని, ఓటుహక్కు వినియోగించు కోవడం వారి బాధ్యత అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఓటు వేసే పోలింగ్‌ రోజే అసలైన పండగ అని పేర్కొన్నారు. ఈ పండగలో యువత తప్పనిసరిగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. దేశంలో అనేక ప్రాంతాలలో ఓటింగ్‌ శాతం అనేది చాలా తక్కువ ఉంటుందని, ఇతర రాష్ట్రాల తో పోలిస్తే మన రాష్ట్రంలో ఓటింగ్‌ శాతం చాలా మెరుగ్గా ఉందన్నారు. రాష్ట్రంలో నగరాలు, పట్టణాల్లో ఓటింగ్‌ శాతం తక్కువగా నమోదు అవుతుందని, ఈ ఓటింగ్‌ శాతాన్ని పెంచేందు కు వివిధ చర్యలు చేపడుతున్నామని వెల్లడిరచారు. రాష్ట్రంలో 82 శాతానికి పైగా ఓటింగ్‌ నమోదు చేయటమే ఎన్నికల సంఘం లక్ష్యంగా పెట్టుకుందని వెల్లడిరచారు.

LEAVE A RESPONSE