ప్రభుత్వంపై విమర్శలు బాధాకరం: వెంకట్రామిరెడ్డి

అమరావతి : శుక్రవారం మధ్యాహ్నం జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశం జరగనుంది. రేపటి సమావేశం తర్వాత పీఆర్సీపై స్పష్టత రానుంది. రిపోర్ట్‌ ఇవ్వకుండా పీఆర్సీపై మాట్లాడం అని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి తెలిపారు. సీఎంతో చర్చించిన తర్వాత రేపు సీఎస్‌ సమావేశం నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఉద్యోగ సంఘాల వినతి మేరకే సీఎస్‌ పీఆర్సీపై సీఎంను కలిశారన్నారు. అధికారులు, ప్రభుత్వంపై కొన్ని ఉద్యోగ సంఘాల విమర్శలు బాధాకరమన్నారు. మైలేజ్‌ కోసం కొన్ని ఉద్యోగ సంఘాలు పోరాటాలు చేస్తున్నాయన్నారు. పీఆర్సీపై ఉద్యోగులకు క్లారిటీ ఉందని వెంకట్రామిరెడ్డి అన్నారు.