మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి

– గుంటూరు జిల్లా తెలుగుయువత అద్యక్షులు రావిపాటి సాయి కృష్ణ

జగన్ ఇస్తానన్న ఇస్తున్నది “మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి” అంటూ మోసాన్ని ఎండగడుతూ గుంటూరు జిల్లా తెలుగుయువత అద్యక్షులు రావిపాటి సాయి కృష్ణ ఆధ్వర్యంలో వినూత్న నిరసన

గుంటూరు : తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఎన్నికలకు ముందు ప్రతి ఏటా మెగా డిఎస్సి నిర్వహిస్తామని రాష్ట్రంలో 23000 డిఎస్సి పోస్టులు ఖాళీలు ఉన్నాయని చెప్పి భర్తీ చెయ్యకుండా నాలుగున్నరేళ్లుగా ఏపీ యువతను మోసం చేస్తూ తీరా ఎన్నికలకు రెండు నెలల ముందు 6100 పోస్టులు భర్తీ చేస్తామంటున్న ముఖ్యమంత్రి జగన్ మోసపూరిత వైఖరిని తెలుగుయువత నిరసించింది.

జగన్ వైఖరిని ఎండగడుతూ గుంటూరు జిల్లా తెలుగుయువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ ఆధ్వర్యంలో జనసేన,టిఎన్ఎస్ ఎఫ్ లతో కలిసి గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట కోళ్లను వేలాడదీసి విస్తర్లలో కూరలు లేకుండా, ఎదురుగా వేలాడుతున్న నాటు కోడి కూరలను ఉహించుకొంటూ ఒట్టి అన్నం ఒకరికి ఒకరు పెట్టుకొని తింటూ జగన్ ఇస్తానన్న డిఎస్సి లు అక్కడ ఇచ్చిన డిఎస్సి ఇక్కడ విస్తరాకులో అంటూ నినాదాలతో నిరసన చేశారు.

కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిది ఆళ్ల హరి, టి ఎన్ ఎస్ ఎస్ జిల్లా అధ్యక్షులు మన్నవ వంశి కృష్ణ, తెలుగుయువత రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ ఫిరోజ్,టి ఎన్ టి యూ సి రాష్ట్ర కార్యదర్శి మదమంచి శ్రీనివాసరావు ,టి ఎన్ఎస్ ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాయపాటి అమృత రావు లతో పాటు పెద్దసంఖ్యలో తెలుగుయువత విద్యార్థి నేతలు పాల్గొన్నారు.

Leave a Reply