విద్యాలయాలను వైసీపీ కార్యాలయాలుగా మార్చేశారు

– మాజీ మంత్రి కెఎస్ జవహర్

రాజకీయ ప్రయోజనాల కోసం విద్యార్ధులను జీవితాలను చీకటి మయం చేస్తున్న జగన్ రెడ్డి ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలయ్యింది. జగన్మోహన్ రెడ్డి అధికార దాహానికి విద్యా వ్యవస్థ సర్వనాశనం అవుతుంది. దెందులూరులో సభకు విద్యార్ధులు పెద్ద ఎత్తున తరలిరావాలని విద్యాలయాలకు సెలవు ప్రకటించారు. అదే విధంగా, కళాశాల బస్సులను బలవంతంగా తీసుకుంటున్నారు. వీటన్నింటి కంటే ఇంటర్మీడియట్ ఎన్విరాన్ మెంట్ ఎడ్యుకేషన్ పరీక్షను వాయిదా వేయించడన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. జగన్ రెడ్డి సభతో దాదాపు 10 లక్షల మంది విద్యార్ధులకు ఆటంకం కలిగిస్తున్నారు.

జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యాలయాలను వైసీపీ కార్యాలయాలుగా మార్చేశారు. ఆయన ఏ జిల్లాలో సభలు పెడుతుంటే అక్కడ విద్యాలయాలకు సెలవులు ఇస్తున్నారు. గతంలోను వైసీపీ ప్లీనరీకి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి సెలవులు ప్రకటించారు. మొన్న కాకినాడలో వైసీపీ సమావేశాన్ని జేఎన్టీయూ లో ఏర్పాటు చేసుకున్నారు. జగన్ రెడ్డి అధికార మదానికి విద్యా వ్యవస్థను బలి చేస్తున్నారు.

పరీక్షల్లో మెరుగైన ఉత్తీర్ణత సాధించాలని విద్యార్ధులు ఏడాది అంతా కష్టపడి చదివితే నేడు దానిని వాయిదా చేయడంతో విద్యార్ధులు కలత చెందారు. సకాలంలో పరీక్షలు నిర్వహించకపోతే విద్యార్ధులు పడే మనోవేదన విద్య లేని జగన్ రెడ్డికి ఏం తెలుస్తుంది? జగన్ రెడ్డి ఏం చదువు చదవలేదు కాబట్టి విద్య విలువ తెలియదు.

Leave a Reply