Suryaa.co.in

Andhra Pradesh

నామినేషన్ దాఖలు చేసిన నాదెండ్ల మనోహర్‌

-తరలివచ్చిన కూటమి శ్రేణులు
-రాష్ట్ర ప్రయోజనాల కోసం గెలిపించాలని విజ్ఞప్తి

 తెనాలి నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌ నామినేషన్‌ ప్రక్రియ బుధవారం కోలాహలంగా సాగింది. ఉదయం స్థానిక లింగారావు సెంటర్‌ నుంచి ర్యాలీ రజకచెరువు, గాంధీ చౌక్‌, శివాజీ చౌక్‌ల మీదుగా సబ్‌ కలెక్టర్‌ కార్యాలయానికి చేరుకుంది. మేళతాళాలు, తప్పెట్లు, డీజేలు, కార్యకర్తల నినాదాలతో హోరెత్తించారు.

మార్గమధ్యలో తెనాలి మండలం సోమసుందరపాలెం గ్రామ సర్పంచ్‌ వాకా శ్రీనివాసరావు, 31వ వార్డు కౌన్సిలర్‌ మానస రెడ్డి తమ అనుచరులతో మనోహర్‌ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంపై టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, బీజేపీ రాష్ట్ర నాయకుడు పాటిబండ్ల రామకృష్ణ, జనసేన జిల్లా అధ్యక్షుడు గాదే వెంకటేశ్వరరా వులతో మనోహర్‌ ర్యాలీలో ముందుకు సాగారు. అనంతరం ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, మనోహర్‌ సతీమణి డాక్టర్‌ మనోహరం, బీజేపీ నాయకులు కటారి వాసుదేవనాయుడు, జనసేన జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వరరావు కలిసి ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, సబ్‌ కలెక్టర్‌ ప్రఖార్‌ జైన్‌కు నామినేషన్‌ పత్రాలను అందజేశారు.

రాష్ట్ర ప్రయోజనాల కోసం కూటమి
ఈ సందర్భంగా మనోహర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు త్వరలో మంచి ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. సంక్షేమం అభివృద్ధి, విలువలతో కూడిన రాజకీయాలు చేసేం దుకు కూటమి ఏర్పడిరదన్నారు. ఐదేళ్ల కాలంలో ప్రభుత్వం రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేసిం దని విమర్శించారు. భావితరాల భవిష్యత్తు కోసం కూటమికి ప్రజలందరూ అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ తెనాలిలో ఉమ్మడి అభ్యర్థి మనోహర్‌ గెలుపు తధ్యమని, మెజారిటీ అనేది ప్రతిపక్షాలే చెప్పాలన్నారు. నామినేషన్‌కు వేలాదిమంది స్వచ్ఛందంగా తరలిరావడమే విజయానికి సంకేతమన్నారు

LEAVE A RESPONSE