షిక్కటి చిరునవ్వుతో.. షక్కటి అబద్ధాలతో అక్కషెల్లెమ్మల్ని 5 ఏళ్లుగా మోసగిస్తూనే ఉన్నావుగా జగన్ రెడ్డి!

• వచ్చే ఎన్నికల్లో జగన్ కు బుద్దిచెప్పడానికి మహిళలు సిద్ధమయ్యారు
• డ్వాక్రా మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించి, వారిని పాలనలో భాగస్వాముల్నిచేసింది టీడీపీనే జగన్ రెడ్డి
• మహిళలకు ఆస్తిలో సమానహక్కు, రాజకీయాల్లో 9శాతం, రిజర్వేషన్లు కల్పించింది తెలుగుదేశమే
• ఐదేళ్లలో చంద్రబాబు డ్వాక్రా మహిళలకు రూ.24,669 కోట్లు అందించారు
• మహిళలకు ఇదిచేశానని చెప్పుకోలేని దుస్థితిలో ఉండే జగన్ రెడ్డి ప్రతిపక్షాల్ని, ప్రసారమాధ్యమాల్ని దూషిస్తున్నాడు
• జగన్ రెడ్డి బాధితులంతా ఆయన స్టార్ క్యాంపెయినర్లే
• డ్వాక్రామహిళలు.. అంగన్ వాడీ సిబ్బంది..ఉద్యోగులు..ఉపాధ్యాయులు ఇలా అందరూ క్యాంపెయినర్లే
• అవమానాలు, దాడులు, శిరోముండనాలు కానుకగా పొందిన దళితులు, కుటుంబాలను పోగొట్టుకున్న మైనారిటీలు జగన్ రెడ్డి స్టార్ క్యాంపెయినర్లే
• ఇప్పటివరకు జగన్ రెడ్డి మార్చిన వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రధాన స్టార్ క్యాంపెయినర్లుగా వ్యవహరించబోతున్నారు
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు

జగన్ రెడ్డి అక్కషెల్లెమ్మలను మోసగించడానికి సరికొత్తగా నేడు ఉరవకొండలో కొత్త అబద్ధాలు చెప్పాడని, షిక్కటి చిరునవ్వుతో నాలుగున్నరేళ్ల నుంచీ రాష్ట్రంలోని కోటిమందికి పైగా డ్వాక్రామహిళల్ని వంచిస్తూనే ఉన్నాడని, త్వరలో జరగబోయే ఎన్నికలు తనకు… తనప్రభుత్వానికి చివరి ఎన్నికలని ముఖ్యమం త్రే నోరుజారాడాని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ఎద్దేవాచేశారు.

మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల తో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …

“బటన్ నొక్కితే నేరుగా అక్కషెల్లెమ్మల అకౌంట్లలోకి డబ్బులు పడుతున్నాయని జగన్ చెబుతున్నాడు. కానీ వాస్తవంగా జగన్ రెడ్డి ఇచ్చే సొమ్ముకంటే అధికంగా ఆయన ప్యాలెస్ కు చేరుతోంది. ముఖ్యమంత్రి అయితే దశలవారీగా మద్యా న్ని నిషేధిస్తానని చెప్పిన వ్యక్తి, ఇప్పుడు రాష్ట్రంలో మద్యం వ్యాపారం చేస్తున్నది నిజం కాదా? పేదల ప్రాణాలతో, మహిళల జీవితాలతో ఆటలాడుతున్నది వాస్తవం కాదా? మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు, డ్వాక్రా సంఘా ల్ని సృష్టించింది చంద్రబాబునాయుడని ప్రపచంమంతా తెలుసు. కోటిమందికి పైగా మహిళలు డ్వాక్రా సభ్యులుగా ఉండి లబ్ధిపొందుతున్నారంటే, అందుకు కారణం చంద్రబాబు దూరదృష్టే.

రూ.13,655కోట్ల డ్వాక్రా రుణాలుంటే.. చంద్రబాబు ఐదేళ్లలో డ్వాక్రా మహిళలకు రూ.24,669కోట్లు చెల్లించారు
డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ చేస్తానని చెప్పి.. చంద్రబాబు చేయలేదని, తానే వారిని ఉద్ధరించానని జగన్ రెడ్డి అబద్ధాలు చెబుతున్నాడు. చంద్రబాబు 2014లో మఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేనాటికి మొత్తం రాష్ట్రంలో ఉన్న డ్వాక్రా రుణాలు రూ.13,655కోట్లు. అప్పుడు మొత్తం 85లక్షల మంది డ్వాక్రా మహిళలుంటే, వారికి మూడు విడతల్లో రూ.10వేలచొప్పున మొత్తం రూ.8,500 కోట్లు రుణమాఫీ చేశారు చంద్రబాబు. 2018-19లో చంద్రబాబు ‘పసుపు-కుంకుమ’ కింద రూ.10 వేలకోట్లు ఒకేసారి డ్వాక్రా మహిళలకు అందించారు. వడ్డీ రాయితీ కింద రూ.2,514 కోట్లుచెల్లించారు. మొత్తంగా చంద్రబాబు ఏ రూపంలో అయితేనేమి రూ.24,669కోట్లు డ్వాక్రా మహిళలకు చెల్లించారు.

ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేనాటికి ఉన్న రుణాలు మొత్తం రూ.13,655 కోట్లు అయినాకూడా అంతకు మించి చంద్రబాబు డ్వాక్రా మహిళల కు అందించారు. ఈ చెల్లింపులకు సంబంధించిన లెక్కలన్నీ ప్రభుత్వం వద్దే ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి వాస్తవాలు ఒప్పుకోడు. అడ్డగోలుగా నోరేసుకొని అవలీలగా అబద్ధాలు చెబుతాడు. ప్రజలకు వాస్తవాలు చెప్పే మీడియాసంస్థల్ని, వ్యక్తుల్ని కూడా అంతే అడ్డగోలుగా దూషిస్తాడు. ఈ విధంగా నోటికి పనిచెప్పే వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నాడు. డ్వాక్రా సంఘాలు ఈయనే సృష్టించినట్టు.. ప్రజలకు అన్నీ ఈయనే ఈ నాలుగేళ్లలో చేసేసినట్టు, అంతకు ముందు ఏ ప్రభుత్వం, ఏ ముఖ్యమంత్రి అసలేమీ చేయ లేదన్నట్లు జగన్ రెడ్డి మాట్లాడుతున్నాడు.

5 ఏళ్ల అరాచకపాలనలో జగన్ రెడ్డి బాధితులుగా మారిన వారంతా ఆయన స్టార్ క్యాంపెయినర్లే
పింఛన్లు తీసుకొచ్చిందే స్వర్గీయ ఎన్టీఆర్. ఉమ్మడి రాష్ట్రంలో పేదలకు తొలుత పింఛన్లు అందించింది టీడీపీప్రభుత్వమే. రూ.60ల పింఛన్ రూ.75లు అయితే.. తర్వాత దాన్ని రూ.200లకు చంద్రబాబు పెంచారు. మరలా ఆయనే రూ.200ల పింఛన్ ను రూ.2వేలకు పెంచారు. ఈ జగన్ రెడ్డి అధికారంలోకి రాగానే రూ.3వేల పింఛన్ అందిస్తానని చెప్పి, వృద్ధులు..వికలాంగులు..వితంతువుల్ని మోసగించాడు. రూ.250చొప్పున పెంచుకుంటూ ఈనెలలో రూ.3వేలు ఇచ్చాడు. అదికూడా సక్రమంగా చెల్లించలేదు.

ఇలాంటి మోసపుచర్యలతో ప్రజల్ని వంచిం చి, ఇంకా సిగ్గులేకుండా ప్రజలే నా స్టార్ క్యాంపెయినర్లు అంటున్నాడు. జగన్ రెడ్డి స్టార్ క్యాంపెయినర్లు ప్రజలు కాదు.. ఆయన అధికారాన్ని అడ్డుపెట్టుకొని అడ్డగోలుగా దోపిడీచేసినవారు. అలానే జగన్ రెడ్డి పాలనలో అడుగడుగునా అవ మానాలకు గురై, శిరోముండనాలు కానుకలుగా పొందిన దళితులు స్టార్ క్యాంపెయినర్లుగా వ్యవహరించబోతున్నారు. కోడికత్తి శ్రీను, అతని కుటుంబం స్టార్ క్యాంపెయినర్ గా పనిచేయనుంది. అబ్దుల్ సలా.. అబ్దుల్ సత్తార్ కుటుంబ సభ్యులు, బంధువులతో పాటు, మైనారిటీలు ప్రధాన క్యాంపెయినర్లుగా పనిచేస్తారు.

జగన్ రెడ్డి కల్తీ మద్యానికి బలైన లక్షలాది కుటుంబాలు కూడా స్టార్ క్యాంపెయిన్ చేయడానికి సిద్దంగా ఉన్నాయి. వీళ్లందరికంటే ప్రధానంగా జగన్ రెడ్డి చేత తొలగింపబడిన సొంతపార్టీవారే అతనితరుపున వచ్చే ఎన్నికల్లో ప్రధాన స్టార్ క్యాంపెయినర్లుగా ప్రచారం చేయబోతున్నారు. 5 ఏళ్ల అరాచక పాలనలో జగన్ రెడ్డి బాధితులే అతని తరుపున స్టార్ క్యాంపెయినర్లుగా రాబోతున్నారు. రోజులు లెక్కబెట్టుకోవడమే జగన్ రెడ్డికి మిగిలింది. ఇంకా 78రోజులే అతనికి మిగిలింది.

ఓటమిభయంతో సిట్టింగ్ అభ్యర్థుల్ని మారుస్తూ, నాటకాలు ఆడుతున్నాడు
జగన్ రెడ్డి మాట్లాడితే సింగిల్ గా పోటీచేస్తాను అంటాడు.. అంత దమ్ము, ధైర్యం ఉంటే తన పార్టీలో గెలిచిన అభ్యర్థుల్ని ఎందుకు మారుస్తున్నాడు? ఓటమి భయంతో మార్పులుచేస్తూ.. బీసీ, ఎస్సీ..ఎస్టీ అభ్యర్థుల్ని పక్కనపెడుతూ నాటకాలు ఆడుతున్నాడు. ప్రజల తరిమి కొడతారని అర్థమయ్యే జగన్ రెడ్డి ఇప్పటికీ నిస్సిగ్గుగా టీడీపీ, జనసేనపై ప్రసార మాధ్యమాలపై, గిట్టనివారిపై విషం కక్కుతున్నాడు.

మహిళలకు మేలు చేసిందే తెలుగుదేశం… ఇన్నేళ్లలో మహిళలకు ఇది చేశానని చెప్పుకోలేని దుస్థితి జగన్ రెడ్డిది
ఇన్నేళ్లలో మహిళలకు తాను చేసింది ఏంటో చెప్పుకోలేని దుస్థితిలో జగన్ రెడ్డి ఉన్నాడు. మహిళలకు ఆస్తిలో సమానహక్కు కల్పించింది తెలుగుదేశం. రాజకీ యాల్లో వారికి 9శాతం రిజర్వేషన్లు, సామాజికంగా 33శాతం రిజర్వేషన్లు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. వారి విద్యకోసం విద్యాలయాలు నిర్మించింది తెలుగు దేశం పార్టీనే. జగన్ రెడ్డి చెప్పే ఆసరా..అమ్మఒడి ఆయనే తీసుకొచ్చాడా.. అంతకు ముందు ఆ పథకాలు లేవా?

తండ్రి అధికారం అడ్డుపెట్టుకొని ప్రజల సొమ్ము రూ.43వేలకోట్లు మింగేశాడని ఇప్పటికే జగన్ రెడ్డిపై ఈడీ, సీబీఐ విభాగాలు కేసులు నమోదు చేశాయి. 16 నెలలు జైల్లో ఉన్నాడు. ఇన్ని చేసి.. గత ఎన్నికల్లో ప్రజల్ని మోసగించి అధికారంలోకి వచ్చాక పదేపదే అబద్ధాలతో ఇంకా మోసగించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఒక్క ఛాన్స్ అన్నందుకు నమ్మి ఓట్లేసిన వారే జగన్ రెడ్డిని మూకుమ్మడిగా తరిమికొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో సగమున్న మహిళలు జగన్ రెడ్డిపై, అతని ప్రభుత్వంపై చెప్పలేనంత ఆగ్రహంతో ఉన్నారు.

విలేకరుల ప్రశ్నలకు ఆనంద్ బాబు స్పందన…!
టీడీపీ గేట్లు తెరిస్తే వైసీపీ ఖాళీయే
జగన్ రెడ్డి నియంత్రత్వ పోకడలు, అప్రజాస్వామిక విధానాలు తట్టుకోలేకనే వైసీపీకి ఆ పార్టీ నేతలు గుడ్ బై చెబుతున్నారు. మేం గేట్లు బార్లా తెరిస్తే వైసీపీ ఖాళీ కావడం తథ్యం. జగన్ రెడ్డ ఓటమి ఒప్పుకున్నాడు కాబట్టే..ఇప్పటికే 68 మంది సిట్టింగ్ లను మార్చాడు. శ్రీ కృష్ణ దేవరాయలు ఒక్కడే కాదు.. మచిలీపట్నం ఎంపీ, మరో ఎంపీ సంజీవ్ కుమార్ ఇప్పటికే బయటకు వచ్చారు.” అని ఆనంద్ బాబు చెప్పారు.

Leave a Reply