– కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్
కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కాంగ్రెస్ మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, సోనియా గాంధీలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘త్యాగాలు చేయడానికి అసలు మాజీ ప్రధాని ఇందిరా గాంధీ, కాంగ్రెస్ నేత సోనియా గాంధీలకు మంగళసూత్రాలు ఉన్నాయా? నాకు అనుమానమే’ అంటూ..కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు.
బీహార్లోని బెగుసరాయ్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహిళల మంగళసూత్రాలు, బంగారాన్ని గుంజుకుంటుందని ప్రధాని మోదీ చేసిన విమర్శలపై కాంగ్రెస్ నేత ప్రియాంక స్పందిస్తూ.. తన తండ్రి రాజీవ్ గాంధీ హత్యను ప్రస్తావి.. తన తల్లి సోనియా మంగళ సూత్రాన్ని త్యాగం చేశారని అన్నారు. అలాగే తన నానమ్మ ఇందిరా గాంధీ దేశం కోసం తన ప్రాణాలను అంకితం చేశారని అన్నారు.