-పాల ఫ్యాక్టరీ ఆవరణలో చిట్టి విగ్రహాన్ని పెడతాం
-పశ్చిమ నియోజక వర్గ బీజేపీ అభ్యర్థి యలమంచిలి సత్యనారాయణ చౌదరి
– సుజనా సమక్షంలో బీజేపీలో చేరిన కాంగ్రెస్ సీనియర్ నేత పోతిన బేసు
ప్రజల కోసం తాను సైనికుడిలా పనిచేస్తానని, పశ్చిమ నియోజక వర్గ బీజేపీ అభ్యర్థి యలమంచిలి సత్యనారాయణ చౌదరి అన్నారు. సుజనా సమక్షంలో విజయవాడ పశ్చిమ సీనియర్ కాంగ్రెస్ నేత పోతిన బేసు కంఠేశ్వరుడు పెద్ద సంఖ్యలో అనుచరులతో బీజేపీలో చేరారు. పశ్చిమలో ఎంతో రాజకీయ చరిత్ర ఉన్న నగరాలు బీజేపీలో చేరి దేశ భవిష్యత్తు కోసం కలిసి రావడం శుభ పరిణామమని అన్నారు. పాల ఫ్యాక్టరీ కోసం స్థలం ఇచ్చిన మరుపిల్ల చిట్టి కాంస్య విగ్రహాన్ని ప్రతిష్టిస్తానని హర్ష ధ్వానాలు మధ్య సుజనా ప్రకటించారు.
జగన్ అరాచక పాలనతో ప్రజలు విసిగిపోయారని ఇపుడు కళ్ళు తెరచిన వారు వైసీపీని సాగనంపేందుకు నిర్ణయానికి వచ్చారని, పశ్చిమలో భారీ మెజారిటీతో గెలిపిస్తే ప్రజలకు సైనికుడిలా పనిచేస్తానని సుజనా స్పష్టం చేశారు. బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ అధ్యక్షత వహించిన ఈ సభలో బేసు కంటేశ్వరుడు మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పరచేందుకు విజన్ ఉన్న సుజనా చౌదరిని భారీ మెజారిటీతో గెలుపించుకుంటామన్నారు. ఆదర్శమైన రాజకీయాలు చేసే సుజానాని గెలిపించుకోవాలని నాగుల మీరా కోరారు. జన సేన కన్వీనర్ బా డిత శంకర్, మాజీ మేయర్ తాడి శకుంతల, ఉత్తమ భందారీ, పైలా సోమినాయుడు, పోతిన వెంకటేశ్వర రావు. దాడి రత్నాకర్ తదితరులు కూడా ప్రసంగించారు.