-ఖమ్మం జిల్లాకు చుక్కనీరివ్వని దుర్మార్గుడు కేసీఆర్
-రాష్ట్రంలో బీఆర్ఎస్ అడ్రస్ గల్లంతు
-డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మధిర నియోజకవర్గం బోనకల్లు మండల కేంద్రంలో సోమవారం జరిగిన కార్నర్ మీటింగ్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రసంగించారు. ఇవాళ కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలిసి పార్లమెంటు ఎన్నికల్లో నిలబడ్డారు. ఇంకో పార్టీ అభ్యర్థి ఓట్లు అడిగేందుకు స్థానం ఉందా అని ప్రశ్నిం చారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఒక్క సీటు గెలిచే పరిస్థితి లేదు..ఆ పార్టీ అభ్యర్థి కేంద్రమంత్రి ఎలా అవుతాడని ప్రశ్నించారు. బీఆర్ఎస్ అడ్రస్ గల్లంతైంది.. కారు గ్యారేజ్కు వెళ్లింది.
స్టీరింగ్ ఒకరు, టైర్లు ఒకరు ఊడ తీసుకుని వెళ్లిపోయారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వైఎస్ రూ.1400 కోట్లతో రాజీవ్, ఇందిరా సాగర్ ఎత్తిపోతల పథకాలు చేపడితే, బీఆర్ఎస్ ప్రభుత్వం రీ డిజైన్ పేరుతో 25 వేల కోట్లకు అంచనాలు పెంచారు. ఇప్పటివరకు ఎనిమిది వేల కోట్లు ఖర్చు చేసి ఖమ్మం జిల్లాకు చుక్క నీరు అందించని దుర్మార్గులు బీఆర్ఎస్ పాలకులు అని ధ్వజమెత్తారు. పదేళ్లు పాలించిన మీరు ఏనాడైనా మొదటి వారంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు వేశారా..రెండు నెలల నుంచి మొదటి తేదీనే జీతాలు వేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల కోడ్ ముగియ గానే ఎమ్మెల్యేలు ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజలు చేస్తారని వివరించారు.