అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చారిత్రాత్మక విజయాలను కైవసం చేసుకుందని, ఈ విజయాన్ని చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ప్రజలకు అంకితమిస్తున్నామని తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యులు, మీడియా కమిటీ ఛైర్మన్ టి.డి. జనార్ధన్ అన్నారు.
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలలో తెలుగుదేశం పార్టీ అప్రతిహత విజయం సాధించిన నేపథ్యంలో టిడిపి కేంద్ర కార్యాలయంలో టిడిపి సమాచార హక్కు విభాగం ఆధ్వర్యాన తెలుగుదేశం నాలెడ్జ్ సెంటర్ ఛైర్మన్ గురజాల మాలాద్రి, టీడీపీ సమాచార హక్కు రాష్ట్ర విభాగం ఇన్ చార్జ్ గంగాధర్ నాయకత్వంలో టి.డి. జనార్ధన్ కేక్ కట్ చేశారు. నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ నాయకత్వంలో మరో 30 ఏళ్ళ పాటు రాష్ట్ర ప్రజలకు నిరంతరాయంగా టిడిపి సేవలందిస్తుందని టిడి జనార్ధన్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంకా టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధులు పాతర్ల రమేష్, ఎస్ పి సాహేబ్ పాల్గొన్నారు.