బిజెపి రాష్ట్ర పదాధికారుల సమావేశం లో రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన బిజెపి జాతీయ కార్యదర్శి,, ధర్మవరం ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి వై సత్య కుమార్ కు రాష్ట్ర కార్యాలయం లో ఘన స్వాగతం పలికారు. అనంతరం బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అద్యక్షతన జరిగిన సమావేశంలో ఘనం గా సన్మానించారు. బిజెపి ఎమ్మెల్యే లు సైతం సత్య కుమార్ ను శాలువా లతో సత్కరించారు.
ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి సత్య కుమార్ పార్టీ కి చేసిన సేవలు ప్రస్తావించారు. సత్య కుమార్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్త గా సంఘ పరివార్ క్షేత్రాల ద్వారా, కార్యక్షేత్రం లో ఆయన అనేక కార్యక్రమాలు నిర్వహించారు.
దశాబ్దాల కాలం గా సత్య కాలం పేరుతో అనేక రచనలు సమాజాన్ని చైతన్యవంతం చేయడానికి ఉపకరించాయని సభలో బిజెపి నేతలు ప్రస్తుతించారు.