-వెనక్కు వెళ్లిన పరిశ్రమలు తీసుకుని వస్తా
-రాష్ట్ర అభివృద్ధి లో కీలక పాత్ర వహిస్తా
– ఉక్కు,భారీ పరిశ్రమల శాఖ మంత్రి గా పదవీ స్వీకారం చేసిన అనంతరం మీడియాతో భూపతిరాజు శ్రీనివాస వర్మ
ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాపై ఉంచిన భాద్యతలును వమ్ము కాకుండా నిర్వర్తిస్తా.నేను ఈ స్థాయికి రావడానికి జాతీయ, రాష్ట్ర నేతలు చాలా మంది సహకరించారు. కేంద్ర మంత్రి స్థాయిలోకి తీసుకుని వచ్చి న నాయకులకు ధన్యవాదాలు. రెండు శాఖలకు మంచి పేరు తీసుకుని వస్తాను. ప్రభుత్వ పాలసిలకు అనుగుణంగా నిర్ణయాలు ఉంటాయి. పారిశ్రామిక వేత్తలు ప్రోత్సాహిస్తా. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ప్రధానమంత్రి ఆలోచనలు కు అనుగుణంగా ముందుకు తీసుకుని వెళ్తా.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో సమావేశం అయి అభివృద్ధి కి కృషి చేస్తా. రాష్ట్రం నుండి వెనక్కు వెళ్లిన పరిశ్రమలు తీసుకుని వస్తాను. పరిశ్రమలకు భూమూల కేటియింపుకు చర్యలు. ఉపాధి అవకాశాలు పెంచుతాం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు, బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలుపురంధేశ్వరి, సిఎం రమేష్, మంత్రి కింజరాపు రామ్మోహన్, మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ లతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లతో చర్చించి రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర వహిస్తా.
ఎమ్మెల్యేల సహకారంతో నరసాపురం పార్లమెంట్ అభివృద్ధి కి కృషి చేస్తా. వైజాగ్ స్టీల్ విషయంలో కేంద్ర ప్రభుత్వం విధాన పరంగా నిర్ణయం. చంద్రబాబు, పవన్ ఎన్డీయే కూటమి అధికారంలోకి ఉన్నాం. వారితో సమావేశం అనంతరం విశాఖ ఉక్కు పైవివరాలు ప్రకటిస్తాం. యువతకు పరిశ్రమలు ద్వారా ఉపాధి కల్పించడమే నా లక్ష్యం.