చంద్రబాబుతో కలిసి నివాళులు అర్పించిన పెమ్మసాని
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 126వ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో గురువారం నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు గారితో పాటు గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా అల్లూరికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు చూపిన తెగింపు, చొరవ భారతదేశ స్వాతంత్రానికి తోడ్పడిందని, ఎందరో భారతీయులకు స్ఫూర్తిగా నిలిచిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెమ్మసానితోపాటు కేంద్ర మంత్రులైన కింజారపు రామ్మోహన్ నాయుడు, శ్రీనివాస వర్మ తదితరులు కూడా పాల్గొన్నారు.