Suryaa.co.in

Andhra Pradesh

ప్రపంచ దేశాలకు ఏపీ ప్రకృతి వ్యవసాయం ఆదర్శం

• అన్ని రాష్ట్రాలకు ఏపీ నుంచి సూచనలు
• రాష్ట్ర వ్యవసాయ, శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

అమరావతి: ప్రపంచ దేశాలకు మన రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయం ఆదర్శంగా నిలుస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు ఉత్సాహం చూపుతున్న ఇండోనేషియా, శ్రీలంక ,జాంబియా,రూవాండ దేశాలకు ఛాంపియన్ రైతులను పంపించి తద్వారా సాంకేతిక మద్దతును సమకూర్చేందుకు RYSS సంసిద్ధం అవుతోందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.

45 దేశాల ప్రతినిధులు రాష్ట్రంలో అమలవుతున్న ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాలను పరిశీలించడం గర్వకారణం అని అన్నారు. ప్రకృతి వ్యవసాయంలో నిగూఢమై ఉన్న సైన్స్ ను అర్థం చేసుకొనేందుకు వివిధ దేశాల ప్రతినిధులు రాష్ట్రంలో పర్యటించారని, ఆంధ్రప్రదేశ్ రైతు సాధికార సంస్థ దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.

దేశంలోనే మొదటిసారిగా APCNF కార్యక్రమానికి వచ్చిన ప్రతిష్టాత్మక “గుల్బెంకియన్ ప్రైజ్ ఫర్ హ్యుమానిటి” అవార్డు అందుకొని పోర్చుగల్ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చిన రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ & ప్రభుత్వ సలహాదారులు టి . విజయ్ కుమార్ , రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్ మంత్రి అచ్చెన్నాయుడుని మంగళవారం అమరావతిలో మర్యాదపూర్వకంగా కలిశారు.

15 రాష్ట్రాలకు ఛాంపియన్ కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్ లను పంపించి అక్కడ ప్రకృతి వ్యవసాయానికి నాంది పలికిన ఏపీ రైతు సాధికార సంస్థ జాతీయ వనరుల సంస్థగా గుర్తింపు పొందింది. ఈ నేపథ్యంలో మంత్రి గారు రైతు సాధికార సంస్థ ప్రతినిధులను ప్రత్యేకంగా అభినందించారు.

గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2016 లో రైతు సాధికార సంస్థను ఏర్పాటు చేశారని, ప్రకృతి వ్యవసాయానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు.

LEAVE A RESPONSE