Suryaa.co.in

Andhra Pradesh

శ్రీశైల మల్లన్న సేవలో సీఎం చంద్రబాబు

శ్రీశైలం : ఏపీ సీఎం చంద్రబాబు శ్రీశైలంలోని మల్లన్న ఆలయానికి చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనానంతరం తీర్థప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనాలిచ్చారు. నేడు చంద్రబాబు శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటించనున్నారు.

మడకశిర మండలంలో పింఛన్ల పంపిణీ, ప్రజావేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఉదయం సున్నిపెంటకు హెలికాప్టర్‌లో చేరుకున్న సీఎం చంద్రబాబుకు మంత్రులు నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్‌ రెడ్డి, ఎన్ఎండీ ఫరూక్, గొట్టిపాటి రవికుమార్, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి తదితరులు స్వాగతం పలికారు.

LEAVE A RESPONSE