-కాళేశ్వరం పంపులు ప్రారంభించాలి
-సుంకిశాల నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్
-నిర్మాణ సంస్థ బాధ్యత తీసుకుంటుంది
– సూర్యాపేట కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి
సూర్యాపేట: తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన ప్రారంభం కాలేదు. ముఖ్యమంత్రి తో సహా ఏ ఒక్క మంత్రికి రాష్ట్రం పట్ల చిత్తశుద్ధి , బాధ్యత లేదు. జల్సాల కోసం మంత్రులు పర్యటనలు చేస్తున్నారు. హామీలు నెరవర్చలేక సబ్ కమిటీ ల పేరుతో కాలయాపన చేస్తున్నారు.
తెలంగాణా కి జీవధార ఎప్పటికైనా కాళేశ్వరమే, అందుకే కేసీఆర్ కాళేశ్వరం కట్టాడు. రాష్ట్రంలో ఒక్క ఎకరం పంట ఎండిన కూడా ప్రభుత్వానిదే బాధ్యత. ప్రభుత్వానికి రైతుల పట్ల ఎం మాత్రం చిత్తశుద్ధి ఉన్న కాళేశ్వరం పంపులు ప్రారంభించాలి.
సుంకిశాల నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్. ఉప ముఖ్యమంత్రి అవగాహన లేకుండా అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు. సుంకిశాల విషయంలో నిర్మాణ సంస్థ బాధ్యత తీసుకుంటుంది. తెలంగాణ విద్యార్థులకు అన్యాయం చేసే జి.ఓ నెంబర్ 33 ని రద్దు చేయాలి.
కాంగ్రెస్ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయంతో జీవో 33 ని తీసుకొచ్చింది. రేవంత్ గురువు చంద్రబాబును సంతృప్తి పరచడం కోసమే ఈ జీవో తెచ్చారా అనే అనుమానం కలుగుతుంది.
నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం గురించి ఆలోచన చేసింది,కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం వారి సంక్షోభం కోరుకుంటుంది. జీవో 33 వల్ల విద్యార్థుల భవిష్యత్ ప్రమాదంలో పడే పరిస్థితి వచ్చింది.
ఇప్పటికైనా ప్రభుత్వం జీవో 33 ని ఉపసంహరించుకోవాలి… లేదంటే విద్యార్థుల పేరెంట్స్ కు మద్దతుగా న్యాయపోరాటం చేస్తాం.ముఖ్యమంత్రి,మంత్రులు ప్రాజెక్టుల మీద అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు.పోటీలు పడి నోరు పారేసుకుంటూ ప్రజల్లో అబాసుపాలవుతున్నారు. సుంకిశాల ప్రాజెక్టు ప్రమాదాన్ని వారం రోజులు దాచిపెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది ?