ఏలూరు: మాజీ ఉప ముఖ్యమంత్రి, పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ కీలక నేత ఆళ్ల నాని వైసీపీకి గుడ్‌బై చెప్పారు. పార్టీ పదవులకు సైతం రాజీనామా చేసిన ఆళ్ల.. తానిక రాజకీయాల నుంచి నిష్ర్కమిస్తున్నట్లు ప్రకటించడం, వైసీపీలో సంచలనం సృష్టించింది. వివాదరహితుడిగా పేరున్న ఆళ్ల నాది నిష్ర్కమణకు పార్టీ అధినేత జగన్ నియంతృత్వ వైఖరి, పార్టీ ఓడినప్పటికీ ఇంకా పద్ధతి మార్చుకోని మొండితనమే కారణమని వైసీపీ సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు.
ఆళ్ల విరక్తికి జగన్ వైఖరే కారణమా?
మారని జగన్ నైజంతో – 54 ఏళ్ల వయసుకే రాజకీయ వృత్తిని వదులుకొన్న ఆళ్ల నాని
20 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎమ్మెల్యే నుండి డిప్యూటీ సిఎం వరకు ఎదిగాడు ఆళ్ల నాని. ఏ పార్టీకైనా గెలుపు ఓటములు సహజం. కానీ దేశంలోనే ఘోరాతి ఘోరంగా వైకాపాను జనం సమాధి చేశారు. పార్టీకి కనీసం ప్రతిపక్ష స్థానం కూడా లేదు.
పార్టీ ఏ స్థాయిలో వుందో దానికి తగ్గట్లుగా కాకుండా.. మళ్లీ తన పాలనలో జరిగిన దౌర్జన్యాలు, హత్యల లెక్కనే ప్రస్తుతం వుందని, నెలకే ఆగలేక రాష్ట్రపతి పాలన పెట్టమంటూ.. ఆ పథకం అమలు చేయలేదు. ఈ పథకంలో మోసం దగా అంటూ.. వైకాపాను బతకకుండా జగనే ఇంకా ఇంకా నాశనం చేస్తున్నారు.
దుర్మార్గ పార్టీ వైకాపా అని ప్రజలు ఇంకా ఇకా ఛీకొట్టేలా జగన్, సాక్షి కలిసి చేస్తుంటే.. మింగుడుపడని పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు పార్టీ మారతున్నారు. రాజకీయాల నుండే తప్పుకొంటున్నా అంటూ 54 ఏళ్లకే ఆ వృత్తి నుండి తప్పుకొంటున్నా అని ఆళ్ల నాని రాజీనామా చేయడం పెద్ద ఆశ్చర్యానికి గురి చేయడం లేదు.
ఆ పార్టీ పేరు తనను నీడలా వెంటాడి, వ్యక్తిత్వ హననం చేస్తుంది అని భావించి, రాజకీయల నుండి తప్పుకొంటే.. జనంలో కాస్త పరువు, మర్యాదలు మిగులుతాయి అని ఆలోచిస్తే తప్ప.. 20 ఏళ్ల రాజకీయ జీవితం నుండి, 54 ఏళ్ల వయసులో ఇలాంటి తప్పుకొనే నిర్ణయం తీసుకోరు.