-
రైతుల కోసం మేము చాలా చేశాం..మీరేం చేశారో చెప్పగలరా?
-
కాకాణికి తెలిసింది ఒక్కటే దోచుకోవడం..అడ్డంగా దొరికిపోతే బూతులు తిట్టడం
-
సోమిరెడ్డికి మేత అని ప్రచారం చేయడానికి సిగ్గుందా
-
వైసీపీ హయాంలో పంచభూతాలను దోచేసి ఇప్పుడు దొంగే దొంగ..దొంగ అంటూ కేకలు పెడుతున్నాడు
-
భూ అక్రమాలకు సర్వేపల్లి నియోజకవర్గాన్ని అడ్డాగా మార్చాడు
-
పొదలకూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
పొదలకూరు: వైసీపీ పాలనలో వ్యవసాయ, ఉద్యాన, ఇరిగేషన్ శాఖలను పడుకోబెట్టేశారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఆ శాఖలకు మంత్రులుగా ప్రాతినిధ్యం వహించి నిర్వీర్యం చేశారు. 2014-19 మధ్యకాలంలో ఉద్యాన శాఖ పరిధిలో అమలు చేసే వివిధ స్కీముల ద్వారా జిల్లాలో రూ.371 కోట్లు ఖర్చుపెట్టాం.
అదే 2019-24 మధ్య కాలంలో కేవలం రూ.119 కోట్లు మాత్రమే ఖర్చుపెట్టారు.అందులోనూ రూ.1.87 కోట్లను ఆ ప్రభుత్వం బకాయి పెట్టగా మా ప్రభుత్వం వచ్చాక మంత్రి అచ్చెన్నాయుడు రైతులకు రూ.1.57 కోట్లు విడుదల చేశారు.జిల్లాలో మళ్లీ ఇప్పుడు రూ.10 కోట్లు ఉద్యాన రైతుల కోసం ఖర్చుపెట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు.
వైసీపీ పాలనలో తోడేరు రెడ్డి మంత్రిగా వెలగబెట్టి ఉద్యాన రైతుల కోసం మేము ఖర్చుపెట్టిన దాంట్లో మూడో వంతు కూడా ఖర్చుపెట్టలేకపోయారు. సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి తీసుకుంటే 2014-15, 2018-19 మధ్యకాలంలో 36.74 కోట్లు ఖర్చు పెడితే, వైసీపీ హయాంలో రూ.18.73 కోట్లు ఖర్చు చేశారు.
సామాజిక సాగునీటి గుంతలకు మా ప్రభుత్వ హయాంలో రూ.70 వేలు నుంచి రూ.20 లక్షల వరకు ఉచితంగా ఇచ్చాం..రైతుల కోసం ఎన్నో పథకాలు అమలు చేశాం.మంత్రిగా కాకాణి ఏనాడైనా ఇలా పథకాలు అమలు చేశారా.. కనీసం వాటి గురించి తెలుసా. ఎప్పుడైనా ఒక్క సమీక్ష పెట్టి ఏడ్చారా?
ఎంతసేపటికి కలెక్షన్లు లెకపెట్టుకోవడం..టోలు గేట్లలో దండుకోవడంతో సరిపెట్టుకున్నాడు..పదవుల కోసం కాకాలు పట్టడమే పనిగా పెట్టుకున్నాడు. మా ప్రభుత్వ హయాంలో రైతుల కోసం ఏమి చేశామో అధికారిక లెక్కలతో చెబుతున్నాం..మీ హయాంలో ఏమి పొడిచారో చెప్పే దమ్ముందా?
గత ఏడాది మిచాంగ్ తుఫాన్ సంభవించి నిమ్మతోటల రైతులు భారీగా నష్టపోతే పరిహారాన్ని వైసీపీ వారికే పరిమితం చేశారు. రైతులను ఆదుకునే నష్టపరిహారం పంపిణీలోనూ రాజకీయాలు చేయడం వారికే చెల్లింది. కనీసం మానవత్వం లేకుండా వ్యవహరించారు.
మినీ ట్రాక్టర్, పవర్ టిల్లర్, తైవాన్ స్ప్రేయర్లు తదితర పరికరాలను 50 శాతం సబ్సిడీపై మా ప్రభుత్వ హయాంలో అందిస్తే వైసీపీ ప్రభుత్వంలో పూర్తిగా మూసేశారు. మా హయాంలో ఐదు ఎకరాల లోపు రైతులకు 90 శాతం సబ్సిడీతో సూక్షసేద్య పరికరాలు అందజేశాం. వైసీపీ పాలనలో రైతులకు ఏ వ్యవసాయ పరికరం అందకుండా చేశారు.
ఏ రోజైనా రైతుల కోసం మంత్రిగా అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి గడప తొక్కాడా. కనీసం ఆ ధైర్యం ఉండి ఏడ్చిందా?ప్రజలకు సంబంధించిన ప్రతి అంశాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లే ధైర్యం నాకుంది. నిన్న జరిగిన పొలిట్ బ్యూరో సమావేశంలోనూ జిల్లాకు కృష్ణా జలాల తరలింపు గురించి మాట్లాడాను.
సమాజంలో అత్యంత దయనీయ స్థితిలో ఉన్న గిరిజనుల జీవితాల్లో మార్పు తీసుకొచ్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరాను. గతంలో నెల్లూరు ప్రాంతంలో గిరిజనుల కోసం ఐటీడీఏ సాధించిన విషయాన్ని గుర్తుచేశాను. ప్రజల కోసం మేము చేసినవి చెప్పేందుకు అనేకం ఉన్నాయి. కాకాణికి చెప్పుకోవడానికి ఉన్నది ఒక్కటే సవిటి కాలువల మీద విగ్రహాలు నిర్మించడం.
చిట్టేపల్లిలో క్వార్ట్జ్ తవ్వకాలకు నిర్వహించిన ప్రజాభిప్రాయసేకరణపై మాట్లాడటానికి కాకాణికి సిగ్గుందా?వైసీపీ ప్రభుత్వంలో అన్నీ అనుమతులు ఇచ్చేశారు. మైనింగ్ శాఖ కూడా ఎన్వోసీ ఇచ్చేశాక ఇప్పుడు పర్యావరణ అనుమతుల కోసం పబ్లిక్ హియరింగ్ నిర్వహించారు. సోమిరెడ్డికి మేత అని వాట్సాప్ గ్రూపుల్లో పెట్టుకోవడానికి కొంచెం అంటే కొంచెం కూడా సిగ్గులేకుండా పోయింది.
వరదాపురం మైన్ లో మైనింగ్ లీజు, పర్మిట్లు లేకుండానే కాకాణికి 68 ఎకరాలు మేత. మొగళ్లూరులో 50 ఎకరాలు మేత, పులికల్లులో మేత, ముదిగేడులో మేత, మరుపూరులో మేత. ఒక గ్రావెల్, ఒక మట్టి, ఒక ఇసుక, ఒక క్వార్ట్జ్ అనే తేడా లేకుండా సర్వం దోచేసి ఇప్పుడు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు.
విరువూరులో ఒకరు సొంత అవసరాల కోసం రెండు ట్రాక్టర్లు ఇసుక తోలుకెళుతుంటే పోలీసులు పట్టుకున్నారు. మా ప్రభుత్వంలో పోలీసులకు స్వేచ్ఛ ఉంది.
మీ ప్రభుత్వ హయాంలో బరితెగించి తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు భారీ ఎత్తున ఇసుకను తరలించించినా పట్టించుకున్న అధికారి లేడు.అధికారంలో ఉండగానే మాకు ముగ్గురు సిట్టింగ్ ఎమ్యెల్యేలను కాకాణి గిఫ్ట్ గా పంపాడు..ఎన్నికల్లో వైసీపీని జిల్లాలో జీరో చేశాడు.
సర్వేపల్లి, అక్కంపేట, రామదాసుకండ్రిగ, కొమ్మలపూడి…ఇలా చెప్పుకుంటే పోతే ప్రతి గ్రామంలోనూ భూఅక్రమాలే.అక్రమ మైనింగ్ దందాతో చెరువులు, రిజర్వాయర్లు రూపుకోల్పోయాయి. తిప్పలు, కొండలు లేచిపోయాయి. ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోకపోతే మా నాయకులు తాట తీస్తారని కాకాణి గుర్తుంచుకోవాలి