Suryaa.co.in

Andhra Pradesh

తాడేపల్లి వైసీపీ కార్యాలయానికి పోలీసులు నోటీసులు

అమరావతి: తాడేపల్లి వైసీపీ కార్యాలయానికి పోలీసులు నోటీసులు పంపించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడికి సంబంధించి సీసీ టీవీ పుటేజ్ ఇవ్వాలని పేర్కొంటూ ఈ మేరకు నోటీసులు ఇచ్చారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. టీడీపీ ఆఫీస్‌పై దాడి జరిగిన రోజు తాడేపల్లిలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయం సీసీ టీవీ పుటేజ్ ఇవ్వాలని ఇప్పటికే మంగళగిరి పోలీసులు వైసీపీ కార్యాలయం నిర్వహకులను కోరగా.. తమ వద్ద ఎలాంటి సీసీ టీవీ పుటేజ్ లేదని చెప్పి.. నోటీసులు తీసుకోలేదు.

LEAVE A RESPONSE