Suryaa.co.in

Andhra Pradesh

వైసీపీ పాలనలో ప్రతి పల్లెలో భూ కబ్జాలే….

  •  1వ తేదీ నుండి గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు
  • వీఆర్వో నుండి కలెక్టర్ వరకు గ్రామాల్లోనే అధికారులు
  • ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
  • మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విజ్ఞప్తి

మంగళగిరి: వైసీపీ పాలనలో ప్రతి పల్లెలో భూ కబ్జాలు చోటుచేసుకున్నాయని, ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగా గ్రీవెన్స్ కు వచ్చే అటువంటి ఫిర్యాదులతోపాటు ఇతర అంశాలపైనా ఇస్తున్నవినతులపై సంబంధిత అధికారులతో మాట్లాడి వారి సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తోన్నామని.. రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు.

సోమవారం మంగళగిరి తెలుగుదేశం పార్టీ(టీడీపీ) జాతీయ ప్రధాన కార్యాలయంలో మాజీ శాసనమండలి చైర్మన్ ఎంఏ షరీఫ్, ఎమ్మెల్సీ అశోక్ బాబు, శ్రీరాం చిన్నబాబులతో నిర్వహించిన గ్రీవెన్స్ అనంతరం మండిపల్లి మీడియాతో మాట్లారు. 1వ తేదీ నుండి గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని.. గత ఐదేళ్ల పాలనలో జరిగిన భూ దోపిడీలు, ఆన్ లైన్ ట్యాంపరింగ్ లు, రికార్డుల తారుమారులాంటి సమస్యలను గ్రామాల్లోకి వచ్చే అధికారులకు ప్రజలు తెలియజేయాలని, గ్రామాల్లోనే సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు ప్రయత్నిస్తారని తెలిపారు.

వీఆర్వో నుండి కలెక్టర్ వరకు అధికారులందరూ గ్రామాల్లోనే ఉండి బాధితుల నుండి విన్నపాలు స్వీకరించి సమస్యలను పరిష్కరిస్తారన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలు జయప్రదం చేయాలన్నారు. రాబోయే ఐదేళ్లలో రెవెన్యూ సమస్యలన్నీ పరిష్కరించి మంచి పేరు తెచ్చుకునేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.

విన్నపాలు

ఎన్నికలకు ముందు మదనపల్లిలో తమ భూమిని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు ఆక్రమించి అక్రమంగా ఇళ్లు కట్టారని.. అక్కడికి వెళ్లి అడిగితే చంపుతామని బెదిరించడంతో.. అన్నమయ్య జిల్లా రాయచోటి జేసికి ఫిర్యాదు చేశామని.. తరువాత మదనపల్లి సబ్ కలెక్టర్ కు స్పందనలో అర్జీ ఇచ్చామని.. ఈ భూ ఆక్రమణపై విచారించి భూమిని కబ్జా చేసిన వారిపై, కబ్జాకు సహకరించిన తహశీల్దార్ పై చర్యలు తీసుకోవాలని ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్వేటి నగరం మజరా సుద్దగుంట గ్రామానికి చెందిన రిటైర్డ్ టీచర్ జి. మురళీ గ్రీవెన్స్ లో ఆవేదన వ్యక్తం చేశారు.

పశ్చిమగోదావరి జిల్లా విప్పారు గ్రామానికి చెందిన గుడి మెట్ల కోటయ్య కు చెందిన వ్యవసాయ భూమి ని దేవాదాయ శాఖ బ్లాక్ లో పెట్టడంతో రిజిస్టర్ కాకపోవడంలేదని సమస్యను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దృష్టికి తీసుకురాగా సంబంధిత ఎండోమెంట్ కమిషనర్ కు ఫోన్ చేసి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.

పంచాయతీరాజ్ డిపార్ట్ మెంట్ కు 31 సర్వీస్ ల ద్వారా ఓ బ్యాంకు ఖాతాకు వచ్చిన వందల కోట్ల నిధులు అలాగే బ్యాంకులో ఉన్నాయని. దాన్ని పీడీ ఖాతాకు మళ్లించి గ్రామాలో అభివృద్ధి పనులకు ఆ డబ్బులను వినియోగించాలని గుంటూరుకు చెందిన ఒక వ్యక్తి నేడు గ్రీవెన్స్ లో నేతలకు వినతిని అందించాడు.

తన పేరు భీ. రూపశ్రీ అని తాను ఎంబీఏ చదువుకోవడానికి ఐ-సెట్‌ ఎగ్జామ్ రాశానని తనకు అందులో 8,239 ర్యాంక్ వచ్చిందని తనకు పీబీ సిద్ధార్థ కాలేజీలో సీటు వచ్చిందని.. కాలేజీ వారు సీటుకోసం రూ. 80,000 వేలు ఫీజు అడుగుతున్నారని.. తన తండ్రి డ్రైవర్ గా పనిచేస్తున్నాడని.. అంత డబ్బు కట్టలేక తనను చదువు ఆగిపోమని చెప్పాడని.. తనకు చదువుకోవాలని ఉందని.. తాను శారీరక అంగవైకల్యం కలిగి ఉన్నాని.. తన చదువుకు సాయం చేయాలని మంత్రి మందు ఆమె వాపోయారు. వెంటనే మంత్రి ఆమెకు రూ. 20,000 ఆర్థిక సాయం చేశారు.

గిద్దలూరుకు చెందిన ఓ వృద్ధుడు తన భూ సమస్యపై మంత్రికి మొరపెట్టుకోగా.. మంత్రి వెంటనే స్థానిక ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డికి ఫోన్ చేసి సమస్యను వివరించారు. బాధితుడి సమస్యను తెలియపరిచి సమస్యను పరిష్కరించాలని కోరారు.

అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం మాసాపేట గ్రామంలోని తన భూమి అన్యాక్రాంతం అయ్యిందని.. దానిపై విచారణ జరిపి తనకు న్యాయం చేయాలంటూ పట్టణంలోని పాత రాయచోటికి చెందిన షేక్ సయ్యద్ బాష మంత్రికి విన్నవించుకున్నారు. దీనిపై స్పందించిన మంత్రి భూ సమస్యను పరిష్కరించి న్యాయం చేస్తామని బాషకు హామీ ఇచ్చారు.

గత 20 ఏళ్ళుగా సంఘమిత్రలుగా పనిచేస్తున్న తమని.. కింది స్థాయిలో నాయకులు తొలగించేందుకు ప్రయత్నిస్తోన్నారని.. వైసీపీ పార్టీకి అనుకూలంగా ఉన్నవారిని అలాగే ఉంచి తమను తొలగించేందుకు యత్నిస్తున్నారని.. కుప్పం నియోజకవర్గం గుదుపల్లె మండలానికి చెందిన సంఘమిత్రలు నేడు మంగళగిరి గ్రీవెన్స్ లో నేతల ముందు వాపోయారు. తమను తొలగిస్తే తమ కుటుంబాలు రోడ్డున పడతాయని దయచేసి తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని జి.ఎస్ఎల్ మెడికల్ కాలేజీలో ఎం.డి జనరల్ మెడిసిన్ చదివిన తన కూతురు దొమ్మేటి తేజశ్రీకి గత ప్రభుత్వంలో ఫీజు రియంబర్స్ మెంట్ రాలేదని.. తన కూతురు చదువుకోసం అప్పులు చేయాల్సిన వచ్చిందని.. తనకు ఎటువంటి స్థిరాస్తులు లేవని దయ ఉంచి తన కూతురుకు రావాల్సిన ఫీజురియంబర్స్ మెంట్ వచ్చేలా చూడాలని తేజశ్రీ తండ్రి రామోహనరావు నేడు గ్రీవెన్స్ లో ఆవేదన వ్యక్తం చేశారు.

2013 లో రిటైర్ మెంట్ అయిన తనకు రావాల్సిన సెటిల్ మెంట్ బకాయిలు.. ఇంక్రిమెంట్ బకాయిలు తనకు ఇంకా ఇవ్వలేదని… కాకినాడ డిపోకు వెళ్లి మేనేజర్ ను ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోవడంలేదని.. దయ చేసి తనకు రవాల్సిన బకాయిలను ఇప్పించాలని రాజమండ్రికి చెందిన సూర్యచంద్రరావు మంత్రి ముందు తెలిపారు.

పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరు మండలం గాదెవారిపాలెం గ్రామానికి చెందిన గాదె సూర్యనారాయణ విజ్ఞప్తి చేస్తూ.. తాను టీడీపీ కోసం పనిచేస్తున్నానని తనను వైసీపీలోకి మారమంటే మారకపోవడంతో.. తనకు రావాల్సిన వర్క్ బిల్లులు అడ్డుకోవడమే కాకుండా.. తనపై అక్రమ కేసులు పెట్టి వేధించారని.. తన భూమిలో అక్రమంగా మట్టిని తవ్వేశారని.. తన భూమిలో అక్రమ మట్టి తవ్వకాలు చేపట్టిన వారిపై చర్యలు తీసుకోని.. తనకు రావాల్సిన బిల్లుల డబ్బులను ఇప్పించవలసిందిగా సూర్యనారాయణ గ్రీవెన్స్ లో వేడుకున్నారు.

LEAVE A RESPONSE