-
రూ. 397 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ కింద 5 నెలలపాటు ఉచిత కాలింగ్
-
రోజుకు 2జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్‌ల ప్రయోజనాలు
-
ప్రైవేటు టెలికం సంస్థలు టారీఫ్ రేట్లు పెంచడంతో బీఎస్‌ఎన్ఎల్ ఆఫర్లకు పెరిగిన ఆదరణ
ప్రైవేట్ టెలికం ఆపరేటర్లు అయిన రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వీ (వొడాఫోన్ ఐడియా) ఇటీవల మొబైల్ టారిఫ్ రేట్లను గణనీయంగా పెంచిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వరంగ ఆపరేటర్ అయిన బీఎస్ఎన్ఎల్ వైపు కస్టమర్లు చూస్తున్నారు.
ఇప్పటికే లక్షలాది మంది కస్టమర్లు బీఎస్ఎన్ఎల్‌లోకి పోర్ట్ అయ్యారంటూ కథనాలు కూడా వెలువడుతున్నాయి. ఇక మరింత మంది కస్టమర్లను ఆకట్టుకునేందుకు కంపెనీ ఆకర్షణీయమైన ప్లాన్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ మేరకు రూపొందించిన ప్లాన్‌లో ఒక ఆఫర్ ఆకర్షణీయంగా ఉంది.