Suryaa.co.in

Andhra Pradesh

ఎన్టీఆర్ భవన్‌లో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం వేడుకలు

  • వేడుకల్లో పాల్గొన్న ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ సాధికారత, సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్
  •  తెలుగు తల్లి చిత్రపటానికి పూల మాల వేసిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు, ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ తదితరులు

గురువారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో మాతృ భాషా దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ సాధికారత, సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొని తెలుగు తల్లి చిత్రపటానికి పూల మాల వేశారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. దేశ భాషలందు తెలుగు లెస్స అని గర్వంగా చెప్పుకునే స్థాయికి తెలుగు వాడు ఎదిగాడని అన్నారు. తెలుగు వాడి కీర్తిని ప్రపంచానికి పరిచయం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు.

ప్రముఖ తెలుగు భాషావేత్త, పండితుడు గిడుగు వెంకట రామమూర్తి జన్మదినాన్ని మాతృ భాషా దినోత్సవం జరుపుకుంటున్నామని, ఆధునిక తెలుగు భాష మరియు సాహిత్యాన్ని రూపొందించడంలో ఆయన పాత్ర అనిర్వచనీయమని అన్నారు. ఏ దేశం వెళ్ళినా, ఏ రాష్ట్రానికి పోయినా, ఎంతటి స్థాయిలో ఉన్నా మాతృ భాషా తెలుగును ఎప్పుడూ మరిచిపోకూడదని అన్నారు. తెలుగు వాడి కీర్తిని మరోసారి ప్రపంచానికి తెలయజేసేందుకు ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌తో పాటు ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు, ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు, పార్టీ నాయకులు బుచ్చి రాంప్రసాద్, చప్పిడి రాజశేఖర్, ఏవి రమణ, నరసింహ ప్రసాద్, మురళి, వెంకటప్ప, పర్చూరి కృష్ణ, వెంకటేశ్వరరావు, పారా రామకృష్ణ, మరియు టీడీపీ మీడియా కోఆర్డినేటర్ దారపనేని నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE