-సెప్టెంబర్ 1న ఆదివారం సెలవు కావడంతో ఒక రోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం
అమరావతి: ప్రతి నెలా 1వ తేదీన “ పేదల సేవలో” కార్యక్రమం క్రింద పంపిణీ చేసే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఈనెల 31వ తేదీనే (శనివారం) పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నేడు ప్రకటన విడుదల చేసింది. సెప్టెంబర్ 1వ తేదీన ఆదివారం కావడం, ఆ రోజు ఉద్యోగులకు సెలవు దినం కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. గ్రామాల్లో లేకపోవడం వల్ల సామాజిక పెన్షన్లు ఆగస్టు 31వ తేదీన అందకపోతే సెప్టెంబర్ 2వ తేదీన (సోమవారం) అందరికీ అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.