(జానకీదేవి, తణుకు)
కుక్కే కదా అని అంత వీజీగా తీసేయకండి. అది అట్లాంటిట్లాంటి కుక్క కాదండి. వందలకోట్ల ఆస్తిపరురాలు. అదేంటి? కుక్క పేరున అన్నేసి ఆస్తులుండటమేమిటనుకుంటున్నారా? మరదే దాని అదృష్టం. కావాలంటే మీరూ ఓ లుక్కేయండి!
డబ్బు సంపాదించాలనే ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈ క్రమంలోనే ఇదే ఆశతో ప్రతి మనిషి ముందుకు సాగుతూ ఉంటాడు అన్న విషయం తెలిసిందే. ఇక డబ్బు సంపాదించడం కోసం ఎన్నో మార్గాలను వెతుక్కుంటూ ఉంటాడు మనిషి. కొంతమంది వ్యాపారం చేయడం ద్వారా డబ్బు సంపాదించాలి అనుకుంటే.. ఇంకొంతమంది ఉద్యోగం చేసి రూపాయి రూపాయి కూడా పెట్టుకుని డబ్బు సంపాదించుకోవాలని అనుకుంటూ ఉంటారు.
మరి కొంతమంది కాస్త రిస్క్ అయినా పర్వాలేదు. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టి అతి తక్కువ సమయంలోనే ధనవంతులు కావాలని ఆశ పడుతూ ఉంటారు. ఇంకొంతమందికి అనుకోని అదృష్టం వరించి, లాటరీ రూపంలో కోట్ల రూపాయలు నజరానా దక్కుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా డబ్బులు సంపాదించాలని ఆశ అందరికీ ఉన్నప్పటికీ కేవలం కొంతమంది మాత్రమే ఇలా డబ్బులు సంపాదించడంలో సక్సెస్ అయ్యి కాస్త ఎక్కువగా బ్యాంకు బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం చూస్తూ ఉంటాము.అయితే ఇలా ఇప్పటివరకు మనుషులు ఉద్యోగాలు వ్యాపారాలు చేసి సంపాదించడం చూసాం. కొంతమంది వేలకోట్ల రూపాయలు కూడా వెనకేసుకోవడం చూశాము. కానీ ఒక కుక్క పేరు మీద ఏకంగా కోట్ల రూపాయల ఆస్తి ఉంది అంటే ఎవరైనా నమ్ముతారా?
కుక్క పేరు మీద ఆస్తి ఉండడమేంటి వినడానికి ఆశ్చర్యంగా ఉంది అని అనుకుంటున్నారు కదా. కానీ ఇక్కడ ఒక కుక్క 3300 కోట్ల రూపాయల ఆస్తులు కలిగి ఉంది. గుంతర్ అనే జర్మన్ షెఫర్డ్ కు ఇలా 3300 కోట్ల ఆస్తులు ఉన్నాయి. దీనికి రోజు 27 మంది సపర్యాలు చేస్తుంటారు. రుచికరమైన ఆహారం వండడానికి చెఫ్ లు, తిరగటానికి స్పెషల్ ఫ్లైట్, యాట్, లగ్జరీ కార్లు ఉన్నాయి.
జర్మనీకి చెందిన కౌంటర్ కార్లోట అనే మహిళ, కొడుకును కోల్పోయి కుమిలి పోయింది. ఈ క్రమంలోనే ఆమె మరణానంతరం తన ఆస్తి మొత్తాన్ని తన పెంపుడు కుక్క అయిన గుంతర్ కు రాసిచ్చింది. అయితే ఇక ఈ కుక్కను ఆమె ఫ్యామిలీ ఫ్రెండ్ సంరక్షిస్తూ ఉండడం గమనార్హం.