Suryaa.co.in

Entertainment

భారీ విరాళం ప్రకటించిన ఎన్టీఆర్, విశ్వక్‌సేన్

తెలుగు రాష్ట్రాలకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ భారీ విరాళం ప్రకటించారు. తెలంగాణకు రూ.50 లక్షలు, ఏపీకి రూ.50 లక్షలను ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేస్తున్నట్లు మంగళవారం ట్విట్ చేశారు. ‘భారీ వర్షాల వల్ల తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న బీభత్సం నన్ను ఎంతగానో కలచివేసింది. ఈ విపత్తు నుంచి తెలుగు ప్రజలు త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను.’ అని ఎన్టీఆర్ తెలిపారు. మరోవైపు టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ కూడా ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.5 లక్షలు, తెలంగాణకు రూ.5 లక్షలు విరాళం అందజేశారు.

LEAVE A RESPONSE