Home » International

అమెరికాలో జూన్‌ 4 తర్వాత గూగుల్‌ పే నిలిపివేత

ప్రముఖ పేమెంట్స్‌ సంస్థ గూగుల్‌ పే జూన్‌ 4 నుంచి అమెరికాలో తన సేవలు నిలిపివేయనున్నట్టు సంస్థ తాజాగా ప్రకటించింది. గూగుల్‌ పే యాప్‌ భారత్‌, సింగపూర్‌లో మాత్రమే పనిచేయనుందని తెలిపింది. కంపెనీ ప్రకారం వినియో గదారులందరూ గూగుల్‌ వాలెట్‌కు బదిలీ చేయబడతారని వెల్లడిరచింది. దీంతో గూగుల్‌ పే సేవలు బంద్‌ కానున్నాయి. గూగుల్‌ వాలెట్‌ను ప్రమోట్‌ చేసేందుకే కంపెనీ ఇలాంటి చర్య తీసుకుందని భావిస్తున్నారు.

Read More

ఇరాన్ అధ్యక్షుడి మృతి ..సంతాపదినం ప్రకటించిన భారత్

హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణించిన నేపథ్యంలో భారత ప్రభుత్వం ఈ నెల 21న సంతాపదినం పాటించనున్నట్లు ప్రకటించింది. రైసీ గౌరవార్థం ఆ రోజున దేశవ్యాప్తంగా జాతీయ జెండాను అవనతం చేయడంతో పాటు అధికారిక వేడుకలకు దూరంగా ఉండాలని కేంద్రం ఆదేశించింది. 1989లో ఇరాన్ తొలి సుప్రీంలీడర్ అయతొల్లా రుహోల్లా ఖొమేనీ మరణించిన సమయంలో భారత్ 3 రోజులు సంతాప దినాలు పాటించింది.

Read More

ఇరాన్‌ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్‌ మొఖ్బర్‌

ఇరాన్‌: ఇరాన్‌ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్‌ మొఖ్బర్‌ నియమి తులయ్యా రు. సుప్రీం లీడర్‌ అయతొల్లా అలీ ఖమేనీ దీనికి ఆమోదముద్ర వేశారు. అధ్య క్షుడిగా ఉన్న ఇబ్రహీం రైసీ తాజాగా హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే. దీంతో ఉపాధ్యక్షుడిగా ఉన్న మొఖ్బర్‌ను తాత్కాలిక దేశాధ్య క్షుడిగా నియమించారు. రైసీ సంతాప సందేశంలో అలీ ఖమేనీ ఈ విషయాన్ని వెల్లడిరచారు. అదేవిధంగా దేశంలో ఐదు రోజుల సంతాప దినాలు ప్రకటిం చారు.

Read More

ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మృతి

-ధ్రువీకరించిన అధికారిక మీడియా -హెలికాప్టర్‌ కూలిన ప్రదేశానికి రెన్క్యూ బృందాలు -మీడియాకు ఫొటోల విడుదల ఇరాన్‌: హెలికాప్టర్‌ కుప్పకూలిన ప్రమాదంలో ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మృతిచెందారు. ఈ విషయాన్ని అధికారిక మీడియా ధ్రువీకరించింది. తూర్పు అజర్‌బ్కెజాన్‌ ప్రావిన్స్‌లోని జోల్ఫా సమీపంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు వెల్లడించింది. అయితే భారీవర్షం, గాలులతో అక్కడ ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొన్నట్లు సమాచారం. హెలికాప్టర్‌ కూలిన ప్రదేశానికి చేరుకున్న రెస్క్యూ టీమ్‌ వారిని గుర్తించింది. ముక్కలైన హెలికాప్టర్‌ ఫొటోలను మీడియాకు…

Read More

వైట్‌హౌస్‌లో పానీపూరి, సమోసాలు

అమెరికా: ఆసియా అమెరికన్లు, స్థానిక హవాయియన్లు, పసిఫిక్‌ ఐలాండర్లపై అధ్యక్షుడి సలహా సంఘం ఏర్పాటై 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వైట్‌ హౌస్‌లో వేడుక నిర్వహించారు. ఈ వేడుకలో భారతీయ దేశభక్తి గీతం ‘సారే జహాసే అచ్చా’ని వైట్‌హౌస్‌ మెరైన్‌ బ్యాండ్‌ అద్భుతంగా ప్లే చేసింది. అనంతరం అతిథులకు భారతీయ వంటకాలైన సమోసాలు, పానీపూరిని వడ్డించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

Read More

తొలి 6G డివైజ్ ను ఆవిష్కరించిన జపాన్

ప్రపంచం లోనే తొలి 6G డివైజ్ ను జపాన్ ఆవిష్కరించింది.. 5G ఇంటర్నెట్ తో పోలిస్తే ఈ డివైజ్ 20 రెట్లు అత్యధిక వేగాన్ని కలిగి ఉంటుందని తెలిపింది. జపాన్ లోని వివిధ టెలికం కంపెనీలు కలిసి దీనిని తయారు చేశాయి. ఇది 300 అడుగుల ప్రాంతాన్ని కవర్ చేసేలా 6G సేవల్ని అందిస్తుంది. ఈ డివైజ్ స్మార్ట్ ఫోన్ కాదని, ఒక ప్రత్యేకమైన పరికరమని టెలికం వర్గాలు పేర్కొన్నాయి.

Read More

కెనడాలో ఘనంగా పదేళ్ల తెలంగాణ ఉత్సవాలు

ఒక్క చోట చేరి సంబూరాలు చేసుకున్న తెలంగాణ ప్రవాసులు. అభినందనల సందేశం పంపిన సీఎం రేవంత్ రెడ్డి, ఇతర ప్రముఖులు కెనడా ప్రముఖ నగరం టోరంటోలో తెలంగాణ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ యేడాది జూన్ తో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి పదేళ్లు నిండుతున్న సందర్భంగా కెనడాలో స్థిరపడిన ప్రవాసులు తెలంగాణ నైట్ పేరుతో ఉత్సవాలను నిర్వహించారు. టోరంటో, మిసిసాగ ఈ వేడుకలకు వేదిక అయింది. తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరమ్ (టీడీఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ…

Read More

జపాన్‌లో 90 లక్షల ఖాళీ ఇళ్లు

-8 లక్షలు తగ్గిన జనాభా -జననాలు పడిపోవడమే ప్రధాన కారణం జపాన్‌లో ఖాళీగా ఉన్న ఇళ్ల సంఖ్య రికార్డు స్థాయిలో 90 లక్షలకు చేరింది. దేశంలో వృద్ధుల సంఖ్య పెరగటం.. అదే సమయంలో జననాలు పడిపోవడం దీనికి ప్రధాన కారణంగా నిపుణులు చెబుతున్నారు. అయితే, ఇటువంటి సమస్య ఒక్క జపాన్‌కే పరిమితం కాదని.. అమెరికా, కొన్ని ఐరోపా దేశాల్లో కూడా ఇలాగే ఉంటుందంటున్నారు. జపాన్‌లో 2023లో అంతకుముందు ఏడాది కన్నా జనాభా 8 లక్షలు తగ్గింది. ఈ…

Read More

భూమిపై అత్యధిక వేడిమి నెల

ఏప్రిల్ 2024 ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేడిమి నెలగా రికార్డు అయిందని యూరోపియన్ యూనియన్ వాతావరణ సంస్థ ‘కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్’ తెలిపింది. ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, తీవ్రమైన వర్షపాతం, వరదల విలయాలు అనేక దేశాలలో రోజువారీ జీవితానికి ఆటంకాలు ఏర్పరిచాయని పేర్కొంది. వరుసగా పదకొండవ నెల ఏప్రిల్‌లో కూడా రికార్డు స్థాయిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని ప్రస్తావించింది.

Read More

యువతి పాకిస్తానీ.. గుండె హిందూస్థానీ

పాక్ యువతిలో భారతీయుడి గుండె భారతీయుడి గుండెతో పాక్‌ యువతికి కొత్త జీవితం కలిగింది. మానవత్వం సరిహద్దులు దాటింది. ఓ భారతీయుడి గుండె పాకిస్థాన్ యువతికి కొత్త జీవితాన్ని ప్రసాదించింది. పాక్ చెందిన రశన్ (19) గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. తీవ్ర అనారోగ్యానికి గురైన ఆమెకు హృదయమార్పిడి చేయకపోతే ఆ వ్యాధి ఊపిరితిత్తులకు వ్యాపించే అవకాశమున్నట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో చెన్నైలోని ఓ ఆస్పత్రిలో వైద్యులు అవయవదానం చేసిన భారతీయుడి గుండెను ఆ యువతికి విజయవంతంగా…

Read More