– రేప్ కేసులో నిందితులకు మద్దతుగా నిలిచిన వ్యక్తికి కాంగ్రెస్ అసెంబ్లీ సీటు
– ఇది ప్రతి మహిళను అవమానపరచటమే
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కథువా రేప్ కేసులో నిందితులకు మద్దతుగా నిలిచిన లాల్ సింగ్ అనే వ్యక్తికి కాంగ్రెస్ అసెంబ్లీ సీటు ప్రకటించటమా? సిగ్గు చేటు. ‘నారీ న్యాయ్’ అంటూ గొప్పలు చెప్పే కాంగ్రెస్ పార్టీ రేపిస్టులను సమర్థించిన వ్యక్తి ఏ విధంగా సీటును కేటాయిస్తుంది? ఇదేనా కాంగ్రెస్ నిత్యం వల్లవేసే ‘నారీ న్యాయ్’ అంటే? ‘నారీ న్యాయ్’ కు కాంగ్రెస్ చెప్పే నిర్వచనం ఇదేనా?
కథువా లో అసిఫా బానో పై జరిగిన దారుణమైన రేప్ ను సమర్థించిన వ్యక్తికి పార్టీ సీటు కేటాయించి…అదే ఘటనలో బాధితుల తరఫున పోరాడుతున్నట్లు సిగ్గు లేకుండా కాంగ్రెస్ పార్టీ ఎట్ల చెప్పుకుంటుంది?
ఇది కచ్చితంగా దేశంలోని ప్రతి మహిళను అవమానపరచటమే. మీ ‘నారీ న్యాయ్’ నినాదం ఎంత డొల్ల అనేది ఈ ఒక్క సంఘటన ద్వారా అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ సిగ్గుమాలిన చర్యలను దేశం మొత్తం గమనిస్తోంది.