Suryaa.co.in

Andhra Pradesh

చిట్టి చేతులు -పెద్ద సాయం

– వరద బాధిత విద్యార్థుల కు పురిటిగడ్డ ప్రభుత్వ పాఠశాల చిన్నారుల చేయూత

కె.కొత్త పాలెం : వరదల్లో విద్యా సామగ్రి కోల్పోయి చదువులకు దూరమైన మోపిదేవి మండలం కె.కొత్త పాలెం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు చేయూత నిచ్చి వాళ్లకు నోట్ పుస్తకాలు ,ఇతర విద్యా సామగ్రి ని అందించిన చల్లపల్లి మండలం,పురిటిగడ్డ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు..వాళ్ళు దాచుకున్న పాకెట్ మనీ నాలుగు వేల రూపాయలతో నోటు పుస్తకాలు కొని, కొత్త పాలెం ప్రభుత్వ పాఠశాలకు స్వయంగా వెళ్లి అందించిన చిన్నారులు. నియోజకవర్గ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. చిన్నారులు సేవా భావాన్ని బుద్ధ ప్రసాద్ అభినందించారు. చిన్ననాటి నుండే సాటి వారికి సాయ పడేలా విద్యార్థులు సేవా భావాన్ని అలవర్చుకోవాలని బుద్ధ ప్రసాద్ పేర్కొన్నారు.

LEAVE A RESPONSE