Suryaa.co.in

Andhra Pradesh

తెలియదు.. గుర్తులేదు..

– పోలీసు విచారణలో వైకాపా నేతల సమాధానం

అమరావతి: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన కేసులో వైకాపా నేతలు లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్‌, తలశిల రఘురామ్‌, న్యాయవాది గవాస్కర్‌ పోలీసు విచారణకు హాజరయ్యారు.

48గంటల్లో విచారణ అధికారికి పాస్‌పోర్టులు అందజేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం వైకాపా ఎమ్మెల్సీలు తలశిల రఘురామమ్‌, లేళ్ల అప్పిరెడ్డి, ఇతర నేతలు దేవినేని అవినాష్‌, న్యాయవాది గవాస్కర్‌ మంగళగిరి గ్రామీణ పోలీస్‌ స్టేషన్‌లో పాస్‌పోర్టులు అందజేశారు.

మంగళగిరి డీఎస్పీ మురళీకృష్ణ, అదనపు ఎస్పీ కొల్లి శ్రీనివాసరావు, ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వీరిని విచారిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. ఆరోజు ఘటనలో తమకేది గుర్తులేదని చెప్పినట్లు తెలిసింది. జగన్ను విమర్శించినందుకే కార్యకర్తలు దాడి చేసినట్లు తమకు తెలుసన్నారు. ఆరోజు తాము ఎక్కడా ప్రత్యక్షంగా పాల్గొనలేదని చెప్పినట్లు తెలిసింది.

విచారణ అధికారులు ఏ విషయాలు అడిగిన తమకు తెలియదని, గుర్తు లేదని సమాధానాలు చెబుతున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా మంగళగిరి పోలీస్ స్టేషన్ వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.

LEAVE A RESPONSE