Suryaa.co.in

Andhra Pradesh

కౌలు చెల్లింపు కోసం నిధులు కేటాయించటం హర్షణీయం

– రాజధాని అమరావతి జేఏసీ సమాఖ్య అధ్యక్షులు మాదల శ్రీనివాస్

అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులకు పెండింగ్‌లో ఉన్న వార్షిక కౌలును చెల్లించాలని నిర్ణయించిన ప్రభుత్వానికి రాజధాని అమరావతి ఐక్యకార్యాచరణ సమితి ధన్యవాదాలు తెలిపింది. రైతులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపింది.

కౌలు నిమిత్తం ప్రభుత్వం ఓటాన్‌ ఎకౌంట్‌లో కేటాయించిన బడ్జెట్‌ రూ.400 కోట్ల నిధులను సీఆర్డీఏకి విడుదల చేస్తూ ఆదేశాలిచ్చిన ప్రభుత్వ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేసింది. కౌలు రైతులకు ఉన్న బకాయిలు సైతం ప్రభుత్వం వీలైనంత త్వరలో విడుదల చేయాలని రాజధాని అమరావతి జేఏసీ సభ్యులు అమరావతి రాజధాని రైతు సమీకరణ సమాఖ్య అధ్యక్షులు మాదల శ్రీనివాస్ కోరారు.

LEAVE A RESPONSE