Suryaa.co.in

Andhra Pradesh

కలిసి పని చేద్దాం.. పరిస్థితుల్లో మార్పులు చేద్దాం

– ప్రభుత్వ ఆసుపత్రుల సేవల పట్ల ప్రజల్లో విశ్వాసం పెంచాలి
– రాజమండ్రి ప్రభుత్వాసుపత్రుల మౌలిక సదుపాయాలు మానవ వనరుల అభివృద్ధికి చర్యలు చేపడతాం
– ప్రజల విశ్వాసం పెంచేలా వైద్య సేవలు అందించేందుకు కృషి చేయాలి
– రోటరీ క్లబ్ అధ్వర్యంలో స్ట్రేచర్ లు, వీల్ చైర్స్ వితరణ అభినందనీయం
– వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్

రాజమహేంద్రవరం: ప్రజల్లో ప్రభుత్వ ఆసుపత్రులలో అందచేసే వైద్య సేవలు పట్ల విశ్వాసం పెంచే ప్రాథమిక బాధ్యత మనపై ఉందని రాష్ర్ట ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు.

శనివారం రాజమహేంద్రవరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సమీక్ష సమావేశంలో పాల్గొని అనంతరం జిల్లా ప్రభుత్వ బోధన ఆసుపత్రికి మంత్రి స్థానిక ప్రజాప్రతినిధులతో జిల్లా మంత్రితో కలిసి సందర్శించడం జరిగింది.

ఈ సందర్భంగా మంత్రి సత్య కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రుల లో అందజేసే వైద్య సేవలో మెరుగైన చికిత్స విధానాలు, మౌలిక సదుపాయాల కల్పన పరిస్థితులలో మార్పులు తిధులు రావడానికి కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.. వైద్య వృత్తి ఎంతో గౌరవప్రదమైన వృత్తి అని, వైద్య సేవలు అందించేవారు పరిమితులకు లోబడి పని చేయాల్సి ఉంటుందన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగే లోటుబాటులను అధిగమించేందుకు మార్పు తీసుకురావడంలో వైద్యులు దెబ్బతో కలిసి పనిచేయాలన్నారు. సమస్యలను తెలుసుకుని వాడి పరిష్కారం దిశగా మన బాధ్యతలను మనం నిర్వర్తించాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో ఇటీవల కాలంలో మూడు శిశుభరణాలు సంభవించడం ఎంతో బాధను కలిగించిందన్నారు. మన నిర్లక్ష్యం వల్ల పక్క ప్రాణం కూడా పోవడానికి కారణం కారాదని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు పొందేందుకు వచ్చే రోగుల పట్ల చిరునవ్వుతో పలకరించి వైద్య సేవలు అందించడం ద్వారా వారిలో నిబ్బరాన్ని మనోధయాన్ని కల్పించగలుగుతామని మంత్రి సత్య కుమార్ తెలిపారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య విధానం కోసం 30 పాయింట్ ఫార్ములా ప్రకారం వైద్య సేవలు అందించేందుకు నిర్దేశ కార్యాచరణ ప్రయాణికులను రూపొందించడం జరిగిందన్నారు. అందుకని భవిష్యత్తులో ఆయా పనులను చేపట్టడం జరిగిందని మంత్రి హామీ ఇచ్చారు.

తొలుత రోటరీ క్లబ్ రాజమండ్రి – రోటరీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గవర్నమెంట్ ఆసుపత్రికి అందచేసిన 10 త్రి సీటర్ ఎయిర్పోర్ట్ వీల్ చైర్స్, 6 ఎస్ఎస్ వీల్ చైర్స్, 6 స్ట్రచ్చర్స్ లని ఆసుపత్రికి అందజేయడం అభినందనీయం అని పేర్కొన్నారు.రోటరీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పట్టపగలు వెంకట రావు ను మంత్రి అభినందించడం జరిగింది.

వైద్య సేవలు పట్ల రోగులు సంతృప్తి వ్యక్తం చేసినా, అయిన కొన్ని లోపాలు ఉన్నాయని పేర్కొన్నారు. 304 మంది వైద్యులు, సిబ్బంది అవసరం కాగా 180 మంది మాత్రమే ఉన్నారని, మౌలిక వసతులు కల్పించడం కోసం ప్రత్యేక దృష్టి పెట్టి దశల వారీగా కల్పించడం జరుగుతుందని అన్నారు. గత ఐదేళ్ళ కాలంలో రాష్ట్రంలో వైద్య రంగాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల నేడు ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు.

రాజకీయ విమర్శలు తమ వైఖరీ కాదని మంత్రి స్పష్టం చేశారు. నర్సింగ్, ఇతర అనుబంధ ఆసుపత్రుల నుంచి స్పెషలిస్ట్ వైద్యులను తీసుకుని రావడం ద్వారా ప్రతి వారంలో నిర్ణీత సమయాల్లో ఆయా వైద్య సేవలు అందించేందుకు కృషి చేయాలన్నారు. ప్రజలకి అందుతున్న వైద్య సేవలు పై సమాచారం తెలుసుకునేందుకు, విద్యార్థులను, స్వచ్చంధ సంస్థలు ఆధ్వర్యంలో ఫీడ్ బ్యాక్ తీసుకుని వాటిని పరిష్కారం చేయాలన్నారు.

జిల్లా మంత్రి రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, ఆసుపత్రి నిర్వహణ వ్యవస్థపై, ఇక్కడ వైద్య సేవలు అందించే క్రమంలో. రోగులకు ఎదురవుతున్న సమస్యలు మంత్రి దృష్టికి రావడం జరిగిందన్నారు. వాటిని తిరిగి జరుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

బయటి వ్యక్తులు ద్వారా రోగులు దోపిడీకి గురవుతున్నరని, ఈ సమస్య పరిష్కారం కోసం అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హామీ ఇచ్చారని చెప్పారు. ఆయా సదుపాయాలు కల్పించిన తదుపరి ప్రజలకి ఏవిధంగా ఇబ్బందులూ లేకుండా చూస్తామన్న హమీ ఇవ్వాలని కోరారు.

శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆసుపత్రిలో మార్చురీ గదిలో ఫీజర్స్ ప్రవేటు వ్యక్తులు ఏర్పాటు చేసి, అధిక మొత్తంలో డబ్బు లు వసూలు చేసి, రోగులను దోచు కుంటున్నారని, వాటిని నియంత్రించాలన్నారు. ప్రతి వారం 4 నుంచి 5 గంటలు ఆసుపత్రిలో ఉండి ప్రజలకి అందుతున్న ఆరోగ్య సేవలపై పరిశీలించడం ద్వారా మరింత మెరుగైన చికిత్స విధానాలు అందించడం పై దృష్టి పెట్టామని తెలియ చేశారు.

ఈ సమావేశం లో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా ఎమ్ లక్ష్మీ సూర్యప్రభ ఆసుపత్రికి సంబంధించిన వివరాలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అందచేశారు. ఏపీఎమ్ఎస్ఐడిసి డివిజనల్ ఇంజనీర్ కృష్ణా రావు వైద్య కళాశాల భవనాలు నిర్మాణం, మౌలిక సదుపాయాలు కల్పించడం, పురోగతి, వచ్చే విద్యా సంవత్సరానికి చేపట్టనున్న పనుల వివరాలను తెలియ చేశారు. అనంతరం మంత్రి వర్యులు వైద్య కళాశాలను పరిశీలించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జిల్లా మంత్రి కందుల దుర్గేష్, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాసు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బత్తుల బలరామకృష్ణ, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, డా. కామినేని శ్రీనివాస్ , ఆసుపత్రి సూపరింటెన్డెంట్ డా ఎమ్ లక్ష్మీ సూర్యప్రభ, మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డా బి. సౌభాగ్య లక్ష్మి, ఇతర వైద్యాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE