Suryaa.co.in

Telangana

దసరా సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

– అక్టోబర్ 12న దసరా పండుగ
– అక్టోబర్ 2 నుంచి 10వ తేదీ వరకు బతుకమ్మ పండుగ
– అక్టోబర్ 2 నుంచి 14వ తేదీ వరకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం

హైదరాబాద్: తెలంగాణలో పాఠశాలలకు దసరా సెలవులను ప్రకటించారు. అక్టోబర్ 2వ తేదీ నుంచి 14 వరకు స్కూళ్లకు దసరా సెలవు ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

అక్టోబర్ 12న దసరా పండుగ ఉంది. 15వ తేదీ నుంచి యథావిధిగా పాఠశాలలు తెరుచుకుంటాయని ఉత్తర్వుల్లో పేర్కొంది.దసరా పర్వదినానికి ముందు తెలంగాణలో తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ పండుగ ఉంటుంది. అక్టోబర్ 2న ఎంగిలిపూల బతుకమ్మ పండుగతో ప్రారంభమై, దుర్గాష్టమి రోజున సద్దుల బతుకమ్మతో సంబరాలు ముగుస్తాయి. దసరాకు రెండు రోజుల ముందు సద్దుల బతుకమ్మ పండుగ ఉంటుంది.

LEAVE A RESPONSE