Suryaa.co.in

Entertainment

టాలీవుడ్‌కు అక్కినేని సేవలు అమూల్యమైనవి

– ఎమ్మెల్యే బాలకృష్ణ

హైదరాబాద్‌: తెలుగు సినిమా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి సందర్భంగా ఆయనను స్మరించుకోవడం గర్వకారణం… మన హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన పాత్రలు, తెలుగు సినిమాకు ఆయన చేసిన అమూల్యమైన సేవలు చిరస్మరణీమని హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయన కృషి, కీర్తి, స్ఫూర్తి ప్రతి నటునికి మార్గదర్శకం… ఈ శతజయంతి సందర్భంగా, తెలుగు సినీ రంగానికి ఆయన అందించిన అపారమైన సేవలకు మనమందరం శిరసు వంచి కృతజ్ఞతలు తెలుపుదాం… నాటకరంగం నుండి చిత్రరంగం వరకు, ఆయన చేసిన ప్రయాణం ప్రతి ఒక్కరికి ప్రేరణ. ఈ రోజు, ఆయనకు మనమందరం నివాళి అర్పిస్తూ, ఆయన నటన, కృషి, పట్టుదలతో వెలసిన విజయాలను స్మరించుకుందామని పేర్కొన్నారు.

LEAVE A RESPONSE