Suryaa.co.in

Telangana

కడియం శ్రీహరి కట్లపాము లాంటివాడు

– మాజీ మంత్రి తాటికొండ రాజయ్య

స్టేషన్ ఘనపూర్: కడియం శ్రీహరి మతిభ్రమించి మాట్లాడుతున్నారు. ఎలక్షన్ రావంటూనే బీఆర్‌ఎస్ కు డిపాజిట్ దక్కదంటాడు. స్టేషన్ ఘనపూర్ 2004 నుండి 2014 వరకు కడియం శ్రీహరి ని మర్చిపోయింది. తెల్లారి లేస్తే కేసీఆర్ పక్కనే ఉన్న కడియం, అభివృద్ధి జరగలేదనడం హాస్యాస్పదం. అభివృద్ధి లో ఘనపురం 4 వ స్థానం అని ఆనాడే ఇంగ్లీష్ పత్రికలో వచ్చింది.

7 రిజర్వాయర్లు తో 3 పంటలు పండించే అంత అభివృద్ధి జరిగింది. చెక్ డ్యాం లు కట్టి, భూగర్భ జలాలు పెంచుకున్నాము. దేవాదులకు ద్రోహం చేసింది కడియం శ్రీహరి. సోనియా గాంధీకి , వైయస్ కు వ్యతిరేకంగా నీళ్లు విడుదల చేయొద్దని, కీ చెరువులో వేసి అడ్డుకున్న ద్రోహి.

25 వేల జనాభా తో ఏర్పడే మున్సిపాలిటీ ఆనాడు అడ్డుకున్నది కడియం శ్రీహరి. రెండుసార్లు విద్యాశాఖ మంత్రిగా ఉన్న కో- ఎడ్ డిగ్రీ కళాశాల తేలేదు. ఉద్యమంలో సిద్దిపేట తో పోటీ పడ్డ ఘనపురం లో, కరుడు కట్టిన బీఆర్‌ఎస్ శ్రేణులు ఉన్నారు. బీఆర్‌ఎస్ శ్రేణుల కష్టంతో గెలిచి, బీఆర్‌ఎస్ కు డిపాజిట్ రాదనడం విడ్డూరం.

కడియం శ్రీహరి కట్లపాము లాంటివాడు. మొన్నటికి మొన్న డివిజన్ బెంచ్, కోర్టులకు వెళ్తా అని, ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తే ఎదుర్కొంటా అంటున్నాడు. నీ ఎమ్మెల్యే పదవి బీఆర్‌ఎస్ కార్యకర్తలు పెట్టిన భిక్ష. కేసీఆర్ ఏ ఎమ్మెల్యే ఇంటికెళ్ళి కండువా కప్పలే. రేవంత్ రెడ్డి నీ ఇంటికి వచ్చి కండువా కప్పిండు. స్పీకర్ రేవంత్ రెడ్డి మాటలకు విలువ ఇస్తాడా ? రాజ్యాంగానికి విలువ ఇస్తాడా?

కేసీఆర్ ది అవినీతి పాలన ఐతే 10 యేండ్లు పక్కనే ఉన్న కడియం శ్రీహరి వాటా ఎంత? ఎమ్మెల్యే అయ్యి 9 నెలలు గడిచిన ఒక్క రూపాయి నిధులు తీసుకురాలేదు. ఎన్నికలు వస్తే అటు కాంగ్రెస్, ఇటు బీఆర్‌ఎస్ శ్రేణులు కడియం ను ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఉప ఎన్నిక రావాలంటే రాజీనామా చేయాలి. అభివృద్ధి పై చర్చకు కడియం శ్రీహరి సిద్ధమా?

LEAVE A RESPONSE